Share News

దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా యువత పోరాడాలి

ABN , Publish Date - Mar 24 , 2024 | 12:09 AM

దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా యువత పోరా డాలని పీవైఎల్‌ నాయకులు కె.పోతురెడ్డి, టి.బాబురావు, పీడీఎస్‌యూ నాయ కుడు బి.వినోద్‌ పిలుపు నిచ్చారు.

దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా యువత పోరాడాలి
బుట్టాయగూడెంలో భగత్‌సింగ్‌ చిత్రపటం వద్ద విద్యార్థుల నివాళి

భగత్‌సింగ్‌ వర్ధంతి కార్యక్రమాల్లో వక్తల పిలుపు

బుట్టాయగూడెం, మార్చి 23: దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా యువత పోరా డాలని పీవైఎల్‌ నాయకులు కె.పోతురెడ్డి, టి.బాబురావు, పీడీఎస్‌యూ నాయ కుడు బి.వినోద్‌ పిలుపునిచ్చారు. పీవైఎల్‌, పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో దొర మామిడి, బుట్టాయగూడెంలో శనివారం భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖదేవ్‌ల వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. భగత్‌సింగ్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నాయకులు మాట్లాడుతూ సమాజంలో అసమానతలులేని వ్యవస్థ ఉండాలన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణాల ర్పించిన భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖదేవ్‌ ఆశయసాధనకు అందరూ కృషి చేయాలన్నారు. మోదీ ప్రభుత్వం పదేళ్ల పాలనలో నిరుద్యోగులను నిలువునా మోసం చేశారని విమర్శించారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ ప్రజలపై తీవ్రమైన దాడులు చేస్తున్నారన్నారు. పూనెం రాముడు, మామిడి మురళి, కరకాల ప్రతాప్‌, జి.బాబురావు, గోగుల చిన్నారెడ్డి, పండు, వి.సాయి, ఎం.మం గరాజు, కె.రామ్‌, జి.శ్యామ్‌, ఎం.విష్ణు తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు ఎడ్యుకేషన్‌: భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ వర్ధంతి సందర్భంగా పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. పీడీ ఎస్‌యూ రాష్ట్ర అద్యక్షుడు భూషణం మాట్లాడుతూ సామ్రాజ్యవాదానికి వ్యతిరే కంగా స్వాతంత్య్రం కోసం పొగ బాంబుల వర్షాన్ని కురింపించి భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ ఉరికంబం ఎక్కి ప్రాణత్యాగం చేశారని నివాళులర్పించారు. వారి త్యాగానికి భిన్నంగా ఇప్పటి పాలకులు దేశ సంపదను అదాని, అంబానిల కు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఏటా రెండుకోట్ల ఉద్యోగాలు భర్తీచేస్తానని హామీ ఇచ్చిన ప్రదాని మోదీ నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. సంఘ జిల్లా అధ్యక్షుడు నాని మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం సంక్షేమ వసతిగృహాల విద్యార్థుల సమస్యలను కూడా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విద్యార్థులు విప్లవ పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపుని చ్చారు. క్రాంతి, రేవంత్‌, యశ్వంత్‌, చందు తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు టూటౌన్‌: బ్రిటిష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన భగత్‌సింగ్‌, సుఖదేవ్‌, రాజ్‌గురు బాటలో పయనించాలని ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి కేవీ.రమణ, బద్దా వెంకట్రావు అన్నారు. భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో దోపిడీకి వ్యతిరే కంగా అలుపెరగని పోరాటం చేసిన విప్లవయోధులు భగత్‌సింగ్‌, సుఖ్‌దేవ్‌, రాజ్‌గురు అన్నారు. చేపలతూము సెంటర్‌లో భగత్‌సింగ్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. యర్రా శ్రీనివాసరావు, ఎం.అప్పారావు పాల్గొన్నారు.

ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పాఠశాలలు, కాలేజీల్లో వ్యాసరచన పోటీలు నిర్వ హించారు. విజేతలకు ఎస్‌వీఆర్‌కే జూనియర్‌ కాలేజీలో బహుమతుల ప్రదా నం చేశారు. సీపీఎం కార్యాలయంలో జిల్లా కార్యదర్శి ఎ.రవి నగర కార్యదర్శి కిషోర్‌ ఆధ్వర్యంలో భగత్‌సింగ్‌కు నివాళులర్పించారు. రాజ్‌గురు, సుఖదేవ్‌, భగత్‌సింగ్‌ త్యాగాలను గుర్తు చేశారు. రామకృష్ణ, ఆదిశేషు, శ్యామలరాణి, తదితరులు పాల్గొన్నారు. సీపీఐ జిల్లా కార్యాలయంలో బండి వెంకటేశ్వరరావు, భజంత్రి శ్రీనివాస్‌, చింతల సూర్యనారాయణ, రెడ్డి నాగేశ్వరరావు, గేదెల నాగేశ్వరరావు, తదితరులు నివాళులర్పించారు.

వేలేరుపాడు: భగత్‌ సింగ్‌ వర్ధంతి సీపీఐ కార్యాలయంలో గంగరాజు అద్యక్షతన జరిగింది. భగత్‌సింగ్‌ చిత్రపఠానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌ నాయకులు యర్రా మధు, బంధం నాగేశ్వరరావు మాట్లాడారు. యువత భగత్‌సింగ్‌ను ఆదర్శంగా తీసుకుని సమాజంలో అస మానతలు, దోపిడీపై పోరాటాల్లో ముందుండాలన్నారు. సన్నేపల్లి సాయిబాబు, బాడిస రాము, పిట్టా వీరయ్య, దుర్గారావు, బీమరాజు, లెనిన్‌, పాపారావు, అరుణ్‌; ముత్యాలరావు, రాము, జయమ్మ, మంగ తదితరులు పాల్గొన్నారు.

పోలవరం: భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పీడీఎస్‌యూ నేతలు ఎస్‌ మోహన్‌, ఎస్‌కె భాషా అన్నారు. రెడ్డినాగంపాలెంలో జరిగిన వర్థంతి కార్యక్రమంలో చెదల శివ, కుంజం రామా రావు, మోహన్‌ తదితరులు మాట్లాడుతూ అందరికీ విద్య, వైద్యం, ఉపాధి హక్కుకై పోరాడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్‌ఈపి 2020 సామాన్యులకు విద్యను దూరం చేసే పరిస్థితులు తెచ్చాయన్నారు. పాఠశాలల విలీనం వలన గిరిజన ప్రాంత విధ్యార్ధులు దూరమయ్యే అవకాశం ఉందన్నారు. భగత్‌సింగ్‌, సుఖ్‌దేవ్‌, రాజ్‌గురు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సవలం రాంబాబు, విద్యార్థులు పాల్గొన్నారు.

టి.నరసాపురం: భగత్‌సింగ్‌ జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకో వాలని అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యదర్శి బిఎన్‌ సాగర్‌ అన్నారు. అరసం అధ్వర్యంలో భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. సాగర్‌ మాట్లాడుతూ భావప్రకటన స్వేచ్ఛను హరిస్తున్న నేటి మనువాద పాలకులకు వ్యతిరేకంగా మరో స్వాతంత్య్ర పోరాటం నిర్వహించాలన్నారు. పి.పాండురంగారావు, కవి నిమ్మగడ్డ అశోక్‌బాబు, వైద్యుడు కె.సురేంద్రబాబు, పురం శ్రీనివాస్‌, కంచర్ల పవన్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

కుక్కునూరు: సీతారామనగరం, కుక్కునూరు గ్రామాల్లో సీపీఐ ఆధ్వర్యం లో భగత్‌సింగ్‌ వర్ధంతి నిర్వహించారు. భగత్‌సింగ్‌ ఆశయాలకు విరుద్దంగా నేడు పాలన సాగుతోందని సీపీఐ మండల కార్యదర్శి ఎం.వెంకటాచారి ఆరోపిం చారు. భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజా స్వామ్యాన్ని, మత సామరస్యాన్ని కాపాడే పార్టీలకు ప్రజలు ఓట్లు వేసి గెలి పించాలన్నార. సీపీఐ నాయకులు కొన్నే లక్ష్మయ్య, కూరాకుల బాబూరావు, మే డిపల్లి రమణయ్య, గంగాధర శ్రీనివాస్‌, రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2024 | 12:09 AM