Share News

బీసీల సత్తా చూపుతాం

ABN , Publish Date - Apr 14 , 2024 | 12:19 AM

వచ్చే ఎన్నికల్లో బీసీల సత్తా చూపుతామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసరి శ్యామ్‌చంద్రశేషు అన్నారు.

బీసీల సత్తా చూపుతాం
చక్రదేవరపల్లి ‘జయహో బీసీ’లో మాట్లాడుతున్న శేషు..

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసరి శ్యామ్‌చంద్రశేషు

బుట్టాయగూడెం, ఏప్రిల్‌ 13 : వచ్చే ఎన్నికల్లో బీసీల సత్తా చూపుతామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసరి శ్యామ్‌చంద్రశేషు అన్నారు. శనివారం జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లి గ్రామంలో మండల అధ్యక్షుడు సాయిల సత్యనారా యణ ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమాన్ని బీసీ సెల్‌ మండల అధ్యక్షుడు బుసా సత్యనారాయణరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా శేషు మాట్లాడుతూ వైసీపీ హయంలో బీసీలకు తీరని నష్టం జరిగిందన్నారు. 300 మంది బీసీలపై దాడులు వైసీపీ హయాంలో జరిగాయన్నారు. రూ.75వేల కోట్లు బీసీ సబ్‌ ప్లాన్‌ నిధులు పక్కదారి పట్టాయని, బీసీ రిజర్వేషన్లు పది శాతం కోతకు గురై తీవ్రంగా నష్టపోయిన తరుణంలో వచ్చే ఎన్నికల్లో బీసీల సత్తా చూపుతూ వైసీపీని ఓడిస్తామన్నారు. బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి చిట్టిబోయిన రామలింగేశ్వరరావు మాట్లాడుతూ కార్పొరేషన్‌ల ను పునరుద్ధరణ చేస్తామని, బీసీలకు అన్ని రకాలుగా అండగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉంటుంద న్నారు. నాయకులు మండవ లక్ష్మణరావు, కుక్కల మాధవ రావు, శీలం రామచంద్రరావు, రాగాని రామకృష్ణ, గొల్లమందల శ్రీనివాస్‌, సాయిల రాంబాబు, ఉండవల్లి శ్రీనివాస్‌, ఉమా మహేశ్వరి, లింగాల సత్యనారాయ ణ, గంటా శ్రీను, గోలి అనిల్‌, దండే పద్మ, ఎలికే ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు

కూటమి అభ్యర్థుల విజయానికి పూజలు

ఏలూరు కార్పొరేషన్‌ : ప్రతిష్ఠాత్మకంగా జరుగనున్న ఎన్నికల్లో ప్రజల ప్రయోజనం కోసం టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ బావిశెట్టివారి పేటలోని కనకదుర్గమ్మ ఆలయంలో కూటమి నాయకులు ప్రత్యేక పూజలు జరిపారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, మోదీ గోత్రనామాలతో అర్చనలు జరిపారు. ఆలయ అర్చకులు యడవల్లి శ్రీహరిశర్మ కూటమినాయకులు రెడ్డి అప్పలనాయుడు, బడేటి చంటి, ఎంఆర్‌డీ బలరామ్‌, చోడే వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.

యాదవులంతా కూటమి వైపే..

ఏలూరు టూటౌన్‌, ఏప్రిల్‌ 13 : జిల్లాలోని యాదవులంతా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైపే ఉన్నారని యాదవ సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఏలూరులోని ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్‌ క్యాంపు కార్యాలయంలో శనివారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శీలం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ యాదవులంటేనే టీడీపీ, టీడీపీ అంటేనే యాదవులని 1982 నుంచి అండగా ఉంటూ నిరూపించుకున్నామన్నారు. ఉమ్మడి ఎంపీ అభ్యర్థి మహేష్‌యాదవ్‌ నాన్‌లోకల్‌ అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యానించడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. కారుమూరి గతంలో జడ్పీటీసీగా నాన్‌ లోకల్‌లోనే గెలిచాడన్నారు. మాగంటి హేమసుందర్‌ మాట్లాడుతూ ఈనెల 15న గంగన్నగూడెంలో శ్రీకృష్ణ కన్వెన్షన్‌ హాలులో సాయంత్రం ఐదు గంటలకు యాదవుల ఆత్మీయ మహాసభను నిర్వహిస్తున్నా మన్నారు. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పెనుబోయిన మహేష్‌ యాదవ్‌, బాలు మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి మహేష్‌ను ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు. సాయిల సత్యనారాయణ, ఇసుకపల్లి తాతారావు, మల్లిపూడి రాజు, శ్రీనివాస్‌, సీహెచ్‌.శ్రీను, చెమలయ్య, ఎం.శ్రీనివాసరావు, గోవర్దన్‌ పాల్గొన్నారు.

అంబికా కృష్ణ సోదరులను కలసిన పుట్టా

ఏలూరు టూటౌన్‌, ఏప్రిల్‌ 13: ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికాకృష్ణ, ఆయన సోదరుడు అంబికా రాజాలను ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్‌యాదవ్‌ మర్యాదపూర్వకంగా ఏలూరులోనిఇ అంబికా కృష్ణ కార్యాలయంలో శనివారం కలిశారు. రాబోయే ఎన్ని కల్లో తనకు మద్దతు ఇవ్వాలని అంబికా సోదరులను అభ్యర్థించారు. బీజేపీ సీనియర్‌ నాయకులు అంబికా కృష్ణ.. కూటమి గెలుపునకు సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.

వైసీపీ పాలనలో బ్రాహ్మణులకు అన్యాయం

ఏలూరుటూటౌన్‌ : వైసీపీ ప్రభుత్వం బ్రాహ్మణు లకు తీరని అన్యాయం చేసిందని ఏలూరు ఆసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి అన్నారు. ఆర్‌ఆర్‌.పేట వెంకట్రామ కల్యాణ మండపంలో ఏపీ బ్రహ్మణ సాధికార సమితి జిల్లా కన్వీనర్‌ ఎంవీఎస్‌ శర్మ ఆధ్వర్యంలో బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం జరిగింది. ముఖ్యఅతిఽథిగా చంటి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన బ్రహ్మణ కార్పొరేషన్‌ను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రహ్మణుల సంక్షేమానికి బాటలు వేయాలంటే టీడీపీ కూటమి ప్రభుత్వముతోనే సాధ్యమన్నారు. ఎంవీఎస్‌ శర్మ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కూటమి ఎంపీ అభ్యర్థి మహేష్‌యాదవ్‌, ఏలూ రు ఆసెంబ్లీ అభ్యర్థి బడేటి చంటితో సహా జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బ్రాహ్మణ సాధికార కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ రాంప్రసాద్‌, అయ్యంగార్‌, బ్రాహ్మణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

నకిలీ ఓట్లను తొలగించండి : చిర్రి బాలరాజు

బుట్టాయగూడెం, ఏప్రిల్‌ 13 : ఓటర్ల జాబితా నుంచి నకిలీ ఓట్లను తొలగించాలని కోరుతూ శనివారం రిటర్నింగ్‌ అధికారి ఎం.సూర్యతేజకు ఫిర్యాదు చేస్తూ కాపీని ఏఆర్‌వో జీవీఎస్‌ ప్రసాద్‌కు ఉమ్మడి అభ్యర్థి చిర్రి బాలరాజు కేఆర్‌ పురం ఐటీడీఏ కార్యాలయంలో అందజేశారు. పోలవరం నియోజకవర్గం టి.నరసాపురం మండలం శ్రీరామవరం బూత్‌ నెం.90లో ఎస్‌.నెంబరు 1034, 1066, 1082 మూడు సీరియల్‌ నెంబర్లు ఒకే పేరుతో ఉన్నాయని చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. చనిపోయినవారి పేర్లను తొలగించలేదని, ఒకే పేరున మూడు, నాలుగు ఎంట్రీలతో వేర్వేరు నెంబర్లపై ఓట్లు నమోదైనట్టు తెలిపారు. ఓటరు జాబితాలపై విచారణ జరపాలని నకిలీ ఓట్లను తొలగించాలని కోరారు.

Updated Date - Apr 14 , 2024 | 12:19 AM