Share News

వచ్చే ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యం కల్పించాలి

ABN , Publish Date - Feb 26 , 2024 | 12:04 AM

వచ్చే ఎన్నికలలో రాజకీయ పార్టీలు బీసీలకు సముచితమైన ప్రాధాన్యం కల్పించాలని ఆల్‌ ఇండియా బీసీ వెల్ఫేర్‌ అసోసి యేషన్‌ జాతీయ అధ్యక్షుడు గూడురు వెంకటేశ్వరరావు అన్నారు.

వచ్చే ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యం కల్పించాలి
చిప్పాడ చంద్రశేఖరరావుకు నియామక పత్రం అందించి అభినందిస్తున్న వెంకటేశ్వరరావు, తదితరులు

బీసీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ జాతీయ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు

ఉండి, ఫిబ్రవరి 25: వచ్చే ఎన్నికలలో రాజకీయ పార్టీలు బీసీలకు సముచితమైన ప్రాధాన్యం కల్పించాలని ఆల్‌ ఇండియా బీసీ వెల్ఫేర్‌ అసోసి యేషన్‌ జాతీయ అధ్యక్షుడు గూడురు వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం ఉండిలో బీసీ ప్రజా వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉండి గ్రామానికి చెందిన సీనియర్‌ నాయకుడు చిప్పాడ చంద్రశేఖర్‌ను నియమించిట్టు తెలిపి సంబంఽ దిత నియామక పత్రాన్ని అందజేశారు. ఆయన మాట్లాడుతూ దేశం, రాష్ట్రంలో ను బీసీలు నిరంతరం తమహక్కుల కోసం పోరాటం చేస్తున్న సంఖ్యాపరంగా పూర్తిస్థాయిలో స్వాతంత్య్ర ఫలాలు పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్‌ జిల్లా అధ్యక్షుడు కె.సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి కండిబోయిన సుబ్రహ్మణ్యం, నరసాపురం నియోకవర్గం అధ్యక్షుడు మల్లాడి వెంకటేశ్వరరావు, మొగల్తూరు మండల డైరెక్టర్‌ మోటుపల్లి ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయనను ఘనంగా సన్మానించారు. బీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2024 | 12:04 AM