Share News

బ్యాలెట్‌ బాక్సింగ్‌

ABN , Publish Date - May 23 , 2024 | 01:26 AM

ఉద్యోగులు ఎటువైపు మొగ్గుచూపితే... ఫలితం ఆ వైపే!.. ఇది గడిచిన రెండు పర్యాయాల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నిరూపించింది.

 బ్యాలెట్‌ బాక్సింగ్‌

ఎటుచూసినా ఈ దిశగానే బెట్టింగ్‌లు

పోస్టల్‌ బ్యాలెట్‌లు అత్యధికం ఏవైపు అనే దానిపైనా పందేలు

ఉద్యోగుల పాత్రపైనే అందరి దృష్టి

ఉద్యోగులు ఎటువైపు మొగ్గుచూపితే... ఫలితం ఆ వైపే!.. ఇది గడిచిన రెండు పర్యాయాల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నిరూపించింది. ఈసారి ఉద్యోగులు వేసిన పోస్టల్‌ బ్యాలెట్‌లో ఎవరికి అనుకూలత అనే దానిపై ప్రధాన పక్షాలకు ఒక స్పష్టత వచ్చినా తిరిగి ఇదే అంశంపై వాదోపవాదాలు, బెట్టింగ్‌లు మళ్ళీ పుంజుకున్నాయి.

– ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి

ఉద్యోగుల సెంటిమెంట్‌..

ప్రభుత్వ కార్యకలాపాల్లో ప్రధాన భూమిక పోషించేది ఉద్యోగులే. వారిపనితీరు సమర్థ వంతంగా ఉంటే ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల మన్నన పొందుతాయి. ఆ రూపంలో ప్రభుత్వానికి కొంత ప్రజా మద్దతు అలవోకగా దక్కుతుంది. కాని గడిచిన ఐదేళ్లల్లో అధికార వైసీపీ ప్రభుత్వ ఉద్యో గుల వ్యతిరేక విధానాల వైపే మొగ్గు చూపింది. కొంతమందిని మినహాయించి మిగతా ఉద్యోగులను పట్టించుకోకుండా గాలికి వదిలేసింది. వారికి చెందా ల్సిన బకాయిలను చెల్లించకుండా నిలిపివేసింది. పీఆర్సీ అమలు దగ్గర నుంచి పోలీసులకు వారాం తపు సెలవు వరకు జగన్‌ సర్కార్‌ నోట నీటి మూటలు అయ్యాయి. పర్యావసానంగా ఉద్యోగ వర్గాలు ప్రభుత్వంపై అసంతృప్తి పెంచుకుంటూ పోయాయి. పోలింగ్‌ నాటికి ఇది గరిష్ఠస్థాయికి చేరింది. ఈ లోపే పోలింగ్‌ విధులకు హాజరయ్యే ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 15 వేల మందికి పైగా ఈ పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు. ప్రతిసారి పోస్టల్‌ బ్యాలెట్‌ను కేవలం కొంతమంది మాత్రమే వినియోగించుకుని మిగతా వారు ఓటు కు దూరంగా మిగిలేవారు. ఈసారి జిల్లావ్యాప్తంగా 16 వేల మందికి పైగా పోలింగ్‌ విధులకు హాజరయ్యే సిబ్బందిలో 15 వేల మందికి పైగా తమ ఓటుహక్కును విని యోగించుకోవడం గమనార్హం. ప్రభుత్వ వ్యతిరేకత ఈ సమయంలో కొట్టొచ్చినట్టు కనిపించిందని అప్పుడే విశ్లేషించారు. వాస్తవానికి ఉద్యోగులు ఏవైపు మొగ్గు చూపుతారో ఫలితాలు సమాం తరంగా వెలువడతాయనే పాత సెంటిమెంట్‌ ఈసారి తమకే కలిసి వస్తుందని కూటమి లెక్క కట్టింది. పోస్టల్‌ బ్యాలెట్‌తో పాటు మిగతా ఉద్యోగ వర్గాలు తమ ఓటుహక్కు వినియోగంలో చొరవ చూపారని, అంతేకాకుండా తమతో పాటు మరి కొంతమందిని పోలింగ్‌ కేంద్రాలకు చేర్చారని, ప్రభుత్వ వ్యతిరేకత నేపథ్యంలో జాగ్రత్తగా చూసి ఓటు వేయమని ఓటర్లకు హితబోధ చేయడం ఎవరు కాదనలేని నిజం. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఉద్యోగ వర్గాలు తెలుగుదేశం, బీజేపీ కూటమి వైపే మొగ్గు చూపాయి. 2019 వచ్చేసరికి ఉద్యోగులు జగన్‌ వైపు జై కొట్టారు. ఈ రెండు ఎన్నికలను పరి శీలిస్తే ఉద్యోగులు ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందని ఒక సెంటి మెంట్‌ ఉంది. ఇప్పుడు జరిగిన ఎన్నికల్లోనూ పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకున్న ఉద్యోగులతో పాటు మిగతా ఉద్యోగ వర్గాలన్ని వైసీపీ వ్యతిరేకత తో రగిలిపోయి ఉండడమే కాకుండా కూటమి వైపే వీరంతా మొగ్గు చూపారు. ఈసారి పోలింగ్‌ అర్ధరాత్రి వరకు సాగినా తాము అనుకున్న లక్ష్యం నెరవేరేందుకు విధుల్లో ఉన్న ఉద్యోగులు విసుగు, విరామం లేకుండా ఓపికగా పోలింగ్‌ నిర్వహించ డాన్ని మరికొందరు గుర్తు చేస్తున్నారు. ఏదైనా నియోజకవర్గంలో నువ్వానేనా అన్నట్లు ఓట్ల లెక్కిం పు సమయంలోనూ కొనసాగితే పోస్టల్‌ బ్యాలెట్‌లే కూటమికి కలిసివచ్చే అవకాశం లేకపోలేదు.

ఉద్యోగుల ఓటుపైనే బెట్టింగ్‌లు

ఉద్యోగ వర్గాలు ఏ పార్టీకి మద్దతుగా నిలిచారో.., చివరి క్షణంలో ఓటువేసిన మహిళలు ఎటువైపు గాలి తిప్పబోతున్నారు. యువకులు, రైతులు, కార్మికులు కసితో వేసిన ఓట్లు ఏ పార్టీ కొంప ముంచబోతున్నాయి. మరే పార్టీకి దోహదం చేయబోతున్నాయనే దానిపైనే ఇప్పుడు బెట్టింగ్‌లు సాగుతున్నాయి. జిల్లా కేంద్రమైన ఏలూరులో ఉద్యోగుల సంఖ్య అత్యధికం. ఏలూరు నియోజక వర్గంలో కూటమి వైపు మొగ్గు చూపారని, మిగతా వర్గాలు ఆ దిశగానే పయనించాయని ఇక్కడ టీడీపీకి తిరుగులేని ఆధిక్యత లభిస్తుందని, ఉద్యో గుల ఓట్లను విశ్లేషించి మరీ ఈ బెట్టింగ్‌లు సాగుతున్నాయి. ఇక్కడ పోస్టల్‌ బ్యాలెట్‌లతో పాటు మిగతా ఉద్యో గుల ఓట్లు ఏకపక్షంగా కూటమివైపు మళ్ళాయన్నదే వాదనగా రూ.25 లక్షల నుంచి రూ.90లక్షల వరకు పందేలు సాగాయి. మరికొంత మంది ఉద్యోగుల్లో వైసీపీ అనుకూలురు కూడా భారీగానే ఉన్నారనే విషయాన్ని విస్మరించ కూడ దని వీరితో పాటు తటస్తులు సైతం వైసీపీవైపు మొగ్గు చూపారంటూ పందేలు కాస్తున్నారు. నియోజక వర్గాల వారీగా ఉద్యోగుల ఓట్లే కీలకం కాబోతున్నాయా? లేదా? అనే దానిపై బెట్టింగ్‌ల జోరు పుంజుకుంది. నూజివీడు మునిసి పాలిటీలో, చింతలపూడి నియోజకవర్గంలోని జంగారెడ్డిగూడెం, చింతలపూడి నగరపంచాయతీల పరిధిలోనూ ఈ తరహా పందేలే జోరుగా ఉన్నాయి. ఉద్యోగుల ఓట్లనే ప్రామాణికంగా తీసుకుని బెట్టింగ్‌లకు దిగడం ఈసారి హైలెట్‌. ప్రత్యేకించి ఉపాధ్యాయ వర్గాలు అత్యధికంగా కూటమి వైపు సాగారనే పందేలకు మాత్రం కొందరు వెనుకంజ వేస్తున్నారు.

Updated Date - May 23 , 2024 | 01:26 AM