Share News

కూటమికే అత్యధిక ప్రజామద్దతు

ABN , Publish Date - May 03 , 2024 | 12:29 AM

అత్యధిక ప్రజామద్దతు కూటమికే ఉందని రానున్న ఎన్నికల్లో ఘన విజయం తథ్యమని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి చంటి స్పష్టం చేశారు.

కూటమికే అత్యధిక ప్రజామద్దతు
ఏలూరు 16వ డివిజన్‌లో పార్టీలోకి ఆహ్వానిస్తున్న బడేటి చంటి

ఏలూరు కూటమి అభ్యర్థి బడేటి చంటి

ఏలూరుటూటౌన్‌, మే 2: అత్యధిక ప్రజామద్దతు కూటమికే ఉందని రానున్న ఎన్నికల్లో ఘన విజయం తథ్యమని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి చంటి స్పష్టం చేశారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ టీడీపీలో చేరిక పర్వం ఊపందుకుంది. అధికార పార్టీలో అణచివేతకు గురవుతున్న వారంతా టీడీపీలో చేరుతున్నారు. ఈసారి గెలుపు కూటమి అభ్యర్థి చంటిదేనని తేటతెల్లం కావడంతో అన్ని పార్టీల నుంచి టీడీపీలోకి వలసలు ఎక్కువయ్యాయి. ప్రజానాయకుడు 16వ డివిజన్‌కు చెందిన డాక్టర్‌ వై.సాంబశివరావు వైసీపీని వీడి భారీ సంఖ్యలో తన అనుచరగణంతో చంటి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంటి మాట్లాడుతూ సాంబశివరావు చుట్టుపక్కల 5, 6వ డివిజన్లకు చెందిన పేదప్రజలం దరికి ఉచిత వైద్యం చేస్తారన్నారు. 55 ఏళ్ల నుంచి పలు రాజకీయ పార్టీల్లో తన రాజకీయ ప్రస్థానం కొనసా గించారు. వైసీపీ నాయకుడు ఆళ్ళ నాని చర్యలపై విరక్తిచెంది టీడీపీలోకి చేరుతున్నట్టు సాంబశివరావు తెలిపారు. సాంబశివరావు రాకతో కూటమి మరింత బలోపేతం అయిందన్నారు.

నిస్వార ్థ సేవకు చిరునామా బడేటి కుటుంబం

నిస్వార్థ సేవకు చిరునామా బడేటి కుటుంబమని రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థి బడేటి చంటిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. ఉమ్మడి అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య 50వ డివిజన్‌ ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో గురువారం మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి సతీమణి రేణుకమ్మ, చంటి భార్య మీన, సోదరి మణులు బుల్లెమ్మ, పద్మావతి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు.

Updated Date - May 03 , 2024 | 12:29 AM