Share News

కూటమితోనే రాష్ర్టానికి ఉజ్వల భవిష్యత్‌

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:52 AM

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంతోనే రాష్ర్టానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఏలూరు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య (చంటి) అన్నారు.

కూటమితోనే రాష్ర్టానికి ఉజ్వల భవిష్యత్‌
ఏలూరు 50వ డివిజన్‌లో టీడీపీలో చేరుతున్న వైసీపీ కార్యకర్తలు

ఏలూరు కూటమి అభ్యర్థి బడేటి చంటి

ఏలూరు టూటౌన్‌, ఏప్రిల్‌ 29: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంతోనే రాష్ర్టానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఏలూరు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య (చంటి) అన్నారు. సోమవారం ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా 50, 10, 9వ డివిజన్లలో ఆయన పర్యటించారు. సైకిల్‌తోనే సంతోషం, స్వరాజ్యం సిద్ధిస్తుందన్నారు. కీలకమైన ఈ ఎన్నికల్లో కూటమికి సంపూర్ణమద్దతు ఇచ్చేందుకు ప్రజలు సిద్ధమయ్యారన్నారు. దోపిడీదారుల ప్రభుత్వానికి ఓటు ద్వారా గుణపాఠం చెప్పేందుకు సన్నద్ధమయ్యారన్నారు. ప్రజాస్పందన చూస్తుంటే కూటమి విజయం సాధించడం ఖాయమన్నారు. ఏలూరు పార్లమెంట్‌, అసెంబ్లీ సీట్లను కూటమి అభ్యర్థులు గెలుచుకోవడం ఖాయమైపోయిందన్నారు. మెజారిటీలు ఎంత అనే దానిపైనే చర్చలు సాగుతున్నాయన్నారు. 50వ డివిజన్‌ నుంచి ఇసుకపల్లి తాతారావు ఆధ్వర్యంలో 300మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కష్టపడి పని చేసే కార్యకర్తలు, నాయకులకు టీడీపీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు. ఎంఆర్‌డీ బలరామ్‌, మారం హనుమంతరావు, పెద్దిబోయిన శివప్రసాద్‌, కొల్లేపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2024 | 12:52 AM