జగన్ చేతకాని పాలనతో అన్నీ ఇబ్బందులే
ABN , Publish Date - Apr 20 , 2024 | 11:57 PM
చేతకాని పాలనతో జగన్ ప్రజల జీవితాలను తలకిందులు చేశారని, అన్నీ ఇబ్బందులేనని ఏలూరు టీడీపీ కూటమి అసెంబ్లీ అభ్యర్థి బడేటి చంటి అన్నారు.
ఏలూరు టీడీపీ కూటమి అసెంబ్లీ అభ్యర్థి బడేటి చంటి
ఏలూరుటూటౌన్, ఏప్రిల్ 20 : చేతకాని పాలనతో జగన్ ప్రజల జీవితాలను తలకిందులు చేశారని, అన్నీ ఇబ్బందులేనని ఏలూరు టీడీపీ కూటమి అసెంబ్లీ అభ్యర్థి బడేటి చంటి అన్నారు. శనివారం ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా 47వ డివిజన్‌లో ఆయన పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి అందరినీ ఆప్యాయంగా పలకరి స్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకు కూటమికి ప్రజాదరణ పెరుగుతోందన్నారు. కూటమికి పెరుగుతున్న ప్రజాదరణను చూసి వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారన్నారు. అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామన్నారు. ఎండ సమయంలో కూడా ప్రజలు తనపై చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. మన ప్రభుత్వం రాగానే మీ సమస్యలన్నీ పరిష్కరించి రుణం తీర్చుకుంటానన్నారు. వైసీపీ పతనానికి నాంది పడిందని ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు డిపాజిట్‌లు రావన్నారు. ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా రాక్షస పాలనకు చరమగీతం పాడేందుకు నిర్ణయించుకున్నారన్నారు. కార్యక్రమంలో శివప్రసాద్, కాశీ నరేష్, దుర్గాభవాని, శ్రీనివాస్, మోజేష్, బాబ్జి, యోహాన్ తదితరులు పాల్గొన్నారు.