Share News

హెల్మెట్‌తో ప్రాణానికి భద్రత

ABN , Publish Date - Oct 25 , 2024 | 12:23 AM

ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్‌ భారం కాదు భద్రత అని ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్‌ అన్నారు.

హెల్మెట్‌తో ప్రాణానికి భద్రత
ర్యాలీ ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రోషన్‌కుమార్‌

చింతలపూడి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్‌ భారం కాదు భద్రత అని ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్‌ అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై అవ గాహన కార్యక్రమాలు ముమ్మరం చేశారు. బోసు బొమ్మ సెంటర్‌లో గురువారం అవగాహన ర్యాలీ ప్రారంభించారు. స్వయంగా ర్యాలీలో పాల్గొని వాహనదారులను నిలిపి హెల్మెట్‌ వలన ఉప యోగాలు తెలియజేశారు. ద్విచక్ర వాహనదారు లు హెల్మెట్‌ ధరించాలని, లేదంటే జరిమానా చెల్లించాల్సి ఉంటుందన్నారు. కార్లు నడిపే ప్రతీ ఒక్కరూ సీటు బెల్టు ధరించాలని సూచించారు. ఆర్యవైశ్య సంఘం, మెడికల్‌ అసోసియేషన్‌ అందించిన 15 హెల్మెట్‌లను ఆయన పంపిణీ చేశారు. కె.రాజారెడ్డి, మాటూరి వెంకట్రామయ్య, అట్లూరి శ్రీనివాసరావు, చిట్లూరి ధర్మరాజు, కొత్తపూడి శేషగిరిరావు, వజ్రపు శేఖర్‌, సిఐ రవీంద్ర, ఎస్‌ఐ కుటుంబరావు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

సీసీ రోడ్ల నిర్మాణానికి కార్యాచరణ

ఉంగుటూరు: నియోజకవర్గంలో వంద ఽశాతం సీసీ రహదారుల నిర్మాణానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు ఎమ్మె ల్యే పత్సమట్ల ధర్మరాజు సూచించారు. వివిధ శాఖల అధికారులతో గురువారం ఆయన సమీ క్షించారు. నిర్మాణం నిలిచిన ప్రభుత్వ భవనాల పునర్నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలన్నా రు. చికెన్‌ వ్యర్థాలు ఉపయోగించే ఆక్వా రైతుల పై చర్యలు తీసుకోవాలన్నారు. నీటి సంఘాల ఎన్నికలు సజావుగా సాగేలా రైతులు చొరవ తీసుకోవాలన్నారు. డ్రెయిన్లలో పూడిక తొలగించా లన్నారు. సమీక్షలో ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌ బి, డ్రెయిన్స్‌, మత్స్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

నిరుద్యోగులకు జాబ్‌ మేళా

నిరుద్యోగులు జాబ్‌ మేళా సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అన్నారు. నారాయణపురం ప్రభుత్వ డిగ్రీ కళాశా లలో జాబ్‌ మేళా నిర్వహించారు. సెట్‌వెల్‌ సీఈవో ప్రభాకరరావు, ప్రిన్సిపాల్‌ టీకే.విశ్వేశ్వర రావు, జిల్లా ఎంప్లాయిమెంట్‌ అధికారి మధుసూ దనరావు, కొండా రవి, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ జాన్‌ కెనడీ తదితరులు పాల్గొన్నారు. 80 మం ది హాజరు కాగా 11మంది ఉద్యోగాలకు ఎంపిక య్యారని కోఆర్డినేటర్‌ రవి వివరించారు.

నారాయణపురం జూనియర్‌ కళాశాల నూత న భవనాల నిర్మాణంపై ప్రిన్సిపాల్‌, డీవీఈవో బి.ప్రభాకరరావుతో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు చర్చించారు. ఆర్‌ అండ్‌ బి శాఖ ఎస్‌ఈ వద్ద నూతన భవనాల నిర్మాణానికి అంచనా తీసుకో వాలని సూచించారు.

Updated Date - Oct 25 , 2024 | 12:23 AM