సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:07 AM
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండా లని ఎమ్మెల్యే నాయ కర్ పిలుపునిచ్చారు.

నరసాపురం, జూలై 4: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండా లని ఎమ్మెల్యే నాయ కర్ పిలుపునిచ్చారు. గురువారం మునిసిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై అవగా హన ర్యాలీని ఎమ్మెల్యే నాయకర్, చైర్‌పర్సన్ వెంకటరమణ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నాయకర్ మాట్లాడుతూ వర్షాకాలంలో డయేరి యా, డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు ఎక్కువుగా వస్తాయన్నారు. కావున ప్రజలు కాచిచల్లార్చిన నీరు తాగి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.