Share News

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అందరి బాధ్యత

ABN , Publish Date - Jun 12 , 2024 | 11:48 PM

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అందరి బాధ్యత అని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి కె.రత్న ప్రసాద్‌ అన్నారు.

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అందరి బాధ్యత
సదస్సులో మాట్లాడుతున్న న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రత్న ప్రసాద్‌

జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రత్న ప్రసాద్‌

ఏలూరు క్రైం, జూన్‌ 12 : బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అందరి బాధ్యత అని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి కె.రత్న ప్రసాద్‌ అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో డిప్యూటీ లేబర్‌ కమిషనర్‌, డీఎల్‌ఎస్‌ఎ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. రత్న ప్రసాద్‌ మాట్లాడుతూ చదువు మధ్యలో ఆపివేసిన విద్యార్థులను తిరిగి పాఠశాలల్లో చేర్పించడం, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ చేయాలని సూచించారు. ఆర్ధిక స్తోమత లేని బాలబాలికలకు ప్రభుత్వం ఉచిత విద్య, ఆహార ఏర్పాట్లు చేస్తున్నారని వాటిని వినియోగించుకుని ఉన్నత విద్యనభ్యసించాలని సూచించారు. అసంఘటిత కార్మికు ల వివరాలు ఈ – శ్రమ్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలన్నారు. డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధికోసం వచ్చిన పిల్లలకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తు న్నామన్నారు. ఫ్యాక్టరీల ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు, ఏడీఈ వెంకటావధాని, సర్వశిక్ష అభియాన్‌ ఎఎల్‌ఎస్‌ రాథాకృష్ణ, క్రాఫ్ట్‌ కోఆర్డినేటర్‌ ఆల్‌ఫ్రెడ్‌ గ్జేవియర్‌, పేనల్‌ అడ్వకేట్స్‌ రత్నరాజు, కూన కృష్ణారావు పలువురు పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2024 | 11:48 PM