Share News

పోలీసులపై రాళ్ల వర్షం

ABN , Publish Date - May 29 , 2024 | 12:50 AM

పెంటపాడు మండలం రావిపాడు లో మంగళవారం చోటు చేసుకున్న స్థల వివాదం తీవ్ర ఉద్రి క్తతకు దారితీసింది.

పోలీసులపై రాళ్ల వర్షం
ఆందోళనకారులతో చర్చలు జరుపుతున్న పోలీసులు, అధికారులు

రావిపాడులో ఉద్రిక్తత

స్థలం విషయమై ఇరు వర్గాల మధ్య ఘర్షణ

సైనికాధికారికి 3 సెంట్ల స్థలం కేటాయింపు

వ్యతిరేకించిన దళితులు..

అంబేడ్కర్‌ బొమ్మ ఏర్పాటుకు యత్నం..

అడ్డుకున్న పోలీసులు.. లాఠీచార్జ్‌

ఆందోళనకారులు రాళ్లతో ఎదురుదాడి

డీఎస్పీ, ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు సహా పలువురికి గాయాలు

పెంటపాడు, మే 28 : పెంటపాడు మండలం రావిపాడు లో మంగళవారం చోటు చేసుకున్న స్థల వివాదం తీవ్ర ఉద్రి క్తతకు దారితీసింది. గ్రామానికి చెందిన పలివెల నాగేశ్వరరా వు సైనిక దళంలో సుభేదార్‌ మేజర్‌గా విధులు నిర్వహిస్తు న్నారు. ఆయనకు సైనిక దళం మూడు సెంట్ల స్థలం ఇచ్చేం దుకు అంగీకరించింది. గ్రామంలోవున్న ఒక స్థలంలో తనకు మూడు సెంట్లు ఇవ్వాలని నాగేశ్వరరావు జిల్లా ఉన్నతాధికా రులను కోరారు. దీనిని పరిశీలించి ఆయనకు ఇవ్వాలని ఉన్నతాధికారులు స్థానిక రెవెన్యూ అధికారులను ఆదేశించ డంతో స్థలానికి పొజిషన్‌ సర్టిఫికెట్‌ను ఇచ్చారు. దీనిపై గ్రామానికి చెందిన కొందరు ఎస్సీ వర్గీయులు ఆ స్థలం తాము ఎప్పటి నుంచో అంబేద్కర్‌ సేవా కార్యక్రమాలకు ఉప యోగిస్తున్నామని, దీనిని ఇవ్వడం కుదరదంటూ అడ్డుకున్నా రు. అయితే అక్కడ ఇంటి నిర్మాణానికి నాగేశ్వరరావు సతీమణి విజయలక్ష్మి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం దళితులు అంబేద్కర్‌ బొమ్మను తీసుకువచ్చి ఆ ఇంటి వద్ద పెట్టేశారు. సైనికాధికారి నాగేశ్వరరావు విధి నిర్వ హణ నిమిత్తం హర్యానాలో ఉన్నారు. అంబేద్కర్‌ బొమ్మను ఇక్కడ పెట్టనివ్వకుండా విజయలక్ష్మి అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బొమ్మ అక్కడి నుంచి తీసే వరకూ కదిలేది లేదని బైఠాయించి దీక్షకు దిగారు. తోపులాటలో ఆమెకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఆర్డీవో చెన్నయ్య, డీఎస్పీ మూర్తి ఘటనా స్థలానికి చేరుకుని ఎస్సీ నాయకులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ స్థలంపై 145 సెక్షన్‌ విధి స్తున్నామని, 15 రోజుల వరకూ ఇరు వర్గాలకు చెందిన వారు స్థలం వద్దకు వెళ్ళకూడదని, వెళితే చట్టపరంగా చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు. అంబేద్కర్‌ బొమ్మను అక్కడి నుంచి తీసేయాలని వారు కోరడంతో దళితులు నిరాకరిం చారు. ఎస్సీ నాయకుల సమక్షంలో బొమ్మను పోలీసులు అక్కడి నుంచి తొలగించారు. పోలీసులకు, దళితులకు మధ్య తీవ్ర ఉద్రిక్తత, వాగ్వాదం చోటు చేసుకుంది. ఆందోళనకారు లను చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జీ చేశారు. వెంటనే రెచ్చిపోయిన ఆందోళనకారులు రాళ్లతో పోలీసులపై ఎదురుదాడికి దిగారు. ఈ దాడిలో ఒక ఎస్‌ఐకు, ఇద్దరు కానిస్టేబుల్స్‌కు తీవ్రగాయాలు కాగా డీఎస్పీ మూర్తి తది తరులకు స్వల్పంగా గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. రాళ్ళ దాడితో జిల్లాలోని పోలీస్‌ యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకుంది. దాడికి పాల్పడ్డ వారిలో కొంతమందిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఉదయం ఏడు గంటలకు మొదలై..

రావిపాడులో ఎస్సీ వర్గీయులు, సైనిక అధికారి కుటుంబా నికి మధ్య ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఘర్షణ రాత్రి 12 గంటలైనా కొనసాగుతూనే ఉంది. అంబేద్కర్‌ విగ్ర హం స్థలం వద్ద నుంచి తీసేయడంతో సైనికాధికారి భార్య విజయలక్ష్మి దీక్ష విరమించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పోలీసులపై ఎస్సీ వర్గీయులు రాళ్ళ దాడికి దిగడంతో జిల్లా నుంచి భారీగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామంలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఎస్పీ వి.అజిత, ఏఎస్పీలు భాషా, భీమారావు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

Updated Date - May 29 , 2024 | 12:50 AM