Share News

సాయుధ బలగాల కవాతు

ABN , Publish Date - Mar 04 , 2024 | 11:37 PM

నగరం, పట్టణాల్లో ఎన్నికల చప్పుడు వినపడుతోంది.

సాయుధ బలగాల కవాతు
జంగారెడ్డిగూడెం పట్టణంలో సీఎస్‌ఎఫ్‌ సిబ్బంది కవాతు

ఏలూరు జిల్లాకు చేరిన కేంద్ర బలగాలు

జంగారెడ్డిగూడెం టౌన్‌ / ఏలూరు క్రైం, మార్చి 4: నగరం, పట్టణాల్లో ఎన్నికల చప్పుడు వినపడుతోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో జిల్లాకు వచ్చిన మిలటరీ దళాలు జంగారెడ్డి గూడెం సబ్‌ డివిజన్‌ పరిధిలోని వేగవరం నోవా కాలేజ్‌లో బస చేశాయి. ఏలూరు సబ్‌ డివిజన్‌ పరిధి బలగాలు ఏలూరులోనే బస చేస్తున్నారు. ప్రజల్లో ఆత్మస్ధైర్యం కల్పించేందుకు రక్షణ చర్యల్లో భాగంగా సాయుధ బలగాలు ఏలూరు నగరంలో సోమవారం కవాతు నిర్వహించారు. డీఎస్పీ ఈ శ్రీనివాసులు, వన్‌టౌన్‌ సీఐ రాజశేఖర్‌, టూటౌన్‌ సీఐ ప్రభాకర్‌, సిబ్బం ది, సాయుధబలగాలు కవాతులో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసు అధికారులు చర్యలు చేపట్టారు. జంగారెడ్డిగూడెం ప్రజలు ప్రశాంత వాతా వరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సీఎస్‌ఎఫ్‌ దళాలు రంగంలో దిగాయి. పట్టణంలో సీఎస్‌ఎఫ్‌ దళంతో మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహిం చినట్లు ఇన్‌చార్జి డీఎస్పీ ఎన్‌.సురేష్‌కుమార్‌ రెడ్డ్డి తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో డివిజన్‌కు 90 మంది సీఎస్‌ఎఫ్‌ సిబ్బంది వచ్చినట్లు తెలి పారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వినియోగించుకునేందుకు పూర్తి చర్యలు చేపడతామన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 11:37 PM