Share News

దాచారంలో సాయుధ బలగాల కవాతు

ABN , Publish Date - Apr 07 , 2024 | 11:58 PM

ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటు హక్కును వినియో గించుకోవాలని సందేశాన్ని అందిస్తూ ఆదివారం పోలీసుల ఆధ్వర్యంలో దాచారం గ్రామంలో కవాతు నిర్వహించారు.

దాచారంలో సాయుధ బలగాల కవాతు
దాచారంలో సాయుధ బలగాల కవాతులో ఆర్వో సూర్యతేజ

స్వేచ్ఛాయుతంగా ఎన్నికల నిర్వహణకు చర్యలు

కుక్కునూరు, ఏప్రిల్‌ 7: ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటు హక్కును వినియో గించుకోవాలని సందేశాన్ని అందిస్తూ ఆదివారం పోలీసుల ఆధ్వర్యంలో దాచారం గ్రామంలో కవాతు నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే మండలంలో పలు గ్రామాల్లో కవాత్తు నిర్వహించారు. కాగా ఎలక్షన్‌ రిటర్నింగ్‌ అధికారి, ఐటీడీఏ పీవో సూర్యతేజ, కుక్కునూరు సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఐటీడీఏ పీవో, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సూర్యతేజ తెలిపారు. దాచారంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాజకీయ పార్టీలు, ఇతరులు ఎవరైనా ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే సివిజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. అందరూ సివిజిల్‌ యాప్‌ను సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

సరిహద్దు చెక్‌పోస్టు పరిశీలన

జీలుగుమిల్లి: ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించాలని రిటర్నింగ్‌ అధికారి ఐటీడీఏ పీవో ఎం.సూర్యతేజ అన్నారు. తాటియాకులగూడెం రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టును ఆదివారం పీవోపరిశీలించారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే ఎటువంటి సామగ్రి తరలించకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట ఈవోపీఆర్డీ నిఖిల్‌, పోలీస్‌, పలు శాఖల సిబ్బంది ఉన్నారు.

Updated Date - Apr 07 , 2024 | 11:58 PM