Share News

శాంతియుత వాతావరణంలో ఎన్నికలకు సహకరించాలి

ABN , Publish Date - Apr 06 , 2024 | 11:59 PM

విజయరాయి, నడిపల్లి, జానంపేట గ్రామాల్లో సాయుధ బలగాలతో కవాతు నిర్వహించారు.

శాంతియుత వాతావరణంలో ఎన్నికలకు సహకరించాలి
విజయరాయిలో సాయుధ బలగాల కవాతు

గ్రామాల్లో సాయుధ బలగాల కవాతు

పెదవేగి, ఏప్రిల్‌ 6: శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి ప్రతిఒక్కరూ సహకరించా లని ఎస్‌ఐ వి.రాజేంద్రప్రసాద్‌ కోరారు. విజయరాయి, నడిపల్లి, జానంపేట గ్రామాల్లో సాయుధ బలగాలతో శనివారం కవాతు నిర్వహిం చారు. ఎస్‌ఐ మాట్లాడుతూ ఓటర్లు ఎలాంటి భయాలు, సంకోచాలు లేకుండా పోలింగ్‌ కేంద్రానికి వచ్చి స్వేచ్ఛగా ఓటువేసే వాతావరణాన్ని కల్పిస్తున్నామన్నామని చెప్పారు. మద్యం, నగదు, వస్తువులు తరలిస్తే కేసులు నమోదు చేస్తామని, ప్రలోభాలకు గురిచేసే సామగ్రిపై సమాచారం అందిస్తే వాటిని సీజ్‌ చేస్తామన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్‌ఐ తెలిపారు.

స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోండి

జీలుగుమిల్లి: ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగిం చుకోవాలని సీఐ క్రాంతికుమార్‌, ఎస్సై వి.చంద్రశేఖర్‌ అన్నారు. ములగలంపల్లిలో శనివారం కేంద్ర సాయుధ బలగాలతో కవాతు నిర్వ హించారు. ఎన్నికల నిబంధనలు పాటిస్తూ ప్రజాస్వామ్యంలో తమ ఓటు హక్కు విలువ తెలియజేస్తూ అవగాహన కల్పించారు.

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

ఏలూరు క్రైం: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఈ శ్రీనివాసులు హెచ్చరించారు. వన్‌టౌన్‌ సీఐ ఎన్‌ రాజ శేఖర్‌, రూరల్‌ ఎస్‌ఐ కె.రాజారెడ్డి, వన్‌టౌన్‌ ఎస్‌ఐ ఎన్‌.లక్ష్మణబాబు, పారామిలటరీ దళాలతో శనివారం చాటపర్రు, జాలిపూడి గ్రామాల్లో కవాతు నిర్వహించారు. డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలన్నారు. ఎవరైనా ఓటర్లను భయబ్రాంతులకు గురి చేసినా, వారికి విఘాతం కల్గించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Apr 06 , 2024 | 11:59 PM