Share News

జనసేనలో అంజిబాబు

ABN , Publish Date - Mar 13 , 2024 | 12:44 AM

భీమవరం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నాయకుడు పులపర్తి రామాంజ నేయులు (అంజిబాబు) జనసేన పార్టీలో చేరేందుకు తన అనుచరు లతో కలిసి భారీ ర్యాలీగా మంగళవారం భీమవరం నుంచి మంగళగిరి బయలుదేరి వెళ్లారు.

 జనసేనలో అంజిబాబు

భీమవరం, మార్చి 12 : భీమవరం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నాయకుడు పులపర్తి రామాంజ నేయులు (అంజిబాబు) జనసేన పార్టీలో చేరేందుకు తన అనుచరు లతో కలిసి భారీ ర్యాలీగా మంగళవారం భీమవరం నుంచి మంగళగిరి బయలుదేరి వెళ్లారు. ఉండు రోడ్‌లోని తన కార్యాలయం దగ్గర నుంచి 100 వాహనాలపై ఇరు పార్టీల నాయకులతో కలిసి వెళ్లారు.అంతకు ముందు ఆయన మాట్లాడుతూ పవన్‌ కళ్యాణ్‌ ఆశయాలకు ఆకర్షితుడై జనసేనలో చేరుతున్నానని చెప్పారు. పవన్‌ కళ్యాణ్‌ భీమవరం నుంచి పోటీ చేస్తే ఆయన విజయానికి కృషి చేస్తానన్నారు. మరోచోట పోటీ చేస్తే తానే పోటీకి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, జనసేన పార్టీ ప్రోటోకాల్‌ చైర్మన్‌ మల్లినీడి తిరుమల రావు(బాబి) మాదాసు కనకదుర్గ, గంటా త్రిమూర్తులు, బొక్క సూరిబాబు, ఉండపల్లి రమేష్‌ నాయుడు, చల్లా రాము, చంద్రమోహన్‌, నసీమ బేగం, పలువురు అభిమానులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అంజిబాబును అభినందించారు.

Updated Date - Mar 13 , 2024 | 12:44 AM