చర్చల పేరుతో జాప్యం
ABN , Publish Date - Jan 18 , 2024 | 11:46 PM
అంగన్వాడీల సమ్మె గురు వారం 38వ రోజుకు చేరింది. ప్రభుత్వం ఒక వైపు చర్చలంటూ మరోవైపు అంగన్వాడీలకు నోటీసులు ఇచ్చి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేయడం దారుణమన్నారు.
ప్రభుత్వ తీరుపై అంగన్వాడీల ఆగ్రహం
పోలవరం, జనవరి 18: అంగన్వాడీల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చర్చల పేరిట జాప్యం చేస్తుందని అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ మండల కార్యదర్శి పీఎల్‌ఎస్ కుమారి అన్నారు. అంగన్వాడీల సమ్మె గురు వారం 38వ రోజుకు చేరింది. ప్రభుత్వం ఒక వైపు చర్చలంటూ మరోవైపు అంగన్వాడీలకు నోటీసులు ఇచ్చి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. సుప్రీం కోర్టు తీర్పుకి వ్యతిరేకంగా అంగన్వాడీలపై దీక్షలపై అణచివేత చర్యలు చేయడం దుర్మార్గమని, నోటీసులు ఇచ్చి విధులకు హాజ రుకాకపోతే తొలగిస్తామని బెదిరింపులకు దోరణులకు పాల్పడడం ప్రభు త్వానికి తగద న్నారు. చెరుకూరి మణి, పద్మ, సరస్వతి, హైమవతి, కుబ్ర, జుబేద, వెంకటరమణ, సత్యవతి, విజయ తదితరులు పాల్గొన్నారు.
లింగపాలెం: అంగన్‌వాడీలు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం అంగన్వాడీలపై వివక్షత చూపుతోందన్నారు. సమస్యలను పరిష్కరించకపోతే సామూహిక ఆమరణ నిరాహార దీక్షలు చేస్తామన్నారు. ఎన్నికలకు ముందు అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. ఈ కారక్రమంలో బీజేఎన్ కుమారి, వి.ఈశ్వరి, మండలంలోని అంగన్‌వాడీలు పాల్గొన్నారు.
చింతలపూడి: అంగన్‌వాడీల సమ్మెలో భాగంగా 38వ రోజు స్థానిక నిరసన శిబిరంలో భారీగా కార్యకర్తలు పాల్గొన్నారు. మొక్కవోని దీక్షతో తమ సమస్యల కోసం పోరాడుతున్న కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని జేఏసీ నాయకులు అరుణ, హేమలత, శాంతి కోరారు. విజయవాడలో నిర వధిక నిరాహార దీక్షలతో ప్రభుత్వం తగిన చర్చలు తీసుకోవాలని, లేదంటే రాబోయే కాలంలో ఉద్యమం మరింత తీవ్రమవుతుందన్నారు.
టి.నరసాపురం: అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి డిమాండ్ చేశారు. అంగన్వాడీ కార్యకర్తల సమ్మె శిభిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం ఎన్ని అవరోధాలు సృష్టించినా ఎస్మా చట్టాన్ని ప్రయోగించినా పట్టు విడవకుండా సమ్మె చేయ డం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో తెల్లం రామకృష్ణ, అనుమోలు మురళి, మడకం సుధారాణి, మడకం కుమారి తదితరులు పాల్గొన్నారు.
కుక్కునూరు: సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తా మని అంగన్వాడీలు అన్నారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల అంగ న్వాడీ కార్యకర్తలకు సీపీఎం ఆధ్వర్యంలో భోజనం ఏర్పాటు చేశారు. సీఐటీ యూ నేత సాయికిరణ్, రాయి రమణ, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సంఘీభావం
ఏలూరు ఎడ్యుకేషన్: అంగన్వాడీల పోరాటానికి ఏపీఎన్‌హెచ్‌ఎం జేఏసీ సంపూర్ణ మద్దతునిస్తోందని జేఏసీ రాష్ట్ర చైర్మన్ దయామణి గురువారం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో పనిచేస్తున్న అంగన్వాడీలు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు పనిచేస్తున్నారని, వీరిపై రాష్ట్ర ప్రభుత్వం సవతి ప్రేమ చూపుతోందని ఆరోపించారు. పోరాటాన్ని ఉధృతం చేసే క్రమంలో అంగన్వాడీలు ఈ నెల 20న చేపట్టిన రాస్తారోకో, ర్యాలీల్లో జాతీయ ఆరోగ్య పథకం (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులందరూ సంఘీభావంగా పాల్గొనాలని పిలు పునిచ్చారు. వారు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలకు కూడా మద్దతుగా నిలవాలని కోరారు. ఇప్పుడు అంగన్వాడీల పోరాటానికి మద్దతుగా నిలబడక పోతే భవిష్యత్తులో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు కూడా ఇదే దుస్థితి ఎదురయ్యే అవకాశం లేకపోలేదని దయామణి హెచ్చరించారు.