Share News

కోటి సంతకాల సేకరణ

ABN , Publish Date - Jan 12 , 2024 | 11:58 PM

అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌, సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం అఖిలపక్షాలు, ప్రజా సంఘాలు రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించి కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కోటి సంతకాల సేకరణ
కుక్కునూరులో సంతకాలు సేకరిస్తున్న అంగన్వాడీలు

కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె, ఆందోళన

బుట్టాయగూడెం, జనవరి 12: అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌, సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం అఖిలపక్షాలు, ప్రజా సంఘాలు రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించి కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. పుష్ప అధ్యక్షతన వహించిన సమావేశంలో నాయకులు ఎం.నాగమణి, సున్నం నాగేశ్వరావు, తెల్లం రామకృష్ణ, తగరం బాబురావు, పోతురాజు, కారం దారయ్య మాట్లాడుతూ అంగన్వాడీలు నిరవధిక సమ్మె ప్రారంభించి 32 రోజులు కావస్తుందన్నారు. సమస్యలు పరిష్కరించాలని, ఎస్మా ప్రయోగించడం సరైంది కాదన్నారు. విధుల్లో చేరాలని బెదిరించడం దుర్మార్గం అ న్నారు. సమస్యలను పరిష్కరించకుంటే రాజకీయ పార్టీలతో ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకుంటామని తెలిపారు. యూనియన్‌ నాయకులు రామ లక్ష్మి, మారమ్మ, కృపామణి, ఆకాశమ్మ, ప్రాన్సిస్‌, ముత్యాలమ్మ, వినోద్‌, శ్రీని వాస్‌, శ్రీను అంగనవాడీలు పాల్గొన్నారు. యూటీఎఫ్‌ నేతలు మద్దతు తెలిపారు.

చింతలపూడి: అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌, సీఐటీయు ఆధ్వర్యంలో ప్రదర్శన జరిపి సంతకాల సేకరణ చేపట్టారు. సమ్మె శిబిరం నుండి బోసుబొమ్మ సెంటర్‌కు చేరుకున్నారు. సమస్యలు పరిష్కరించాలని బోసుబొమ్మ సెంటర్‌లో నినాదాలు చేశారు. నత్తా వెంకటేశ్వరరావు, పి.సరో జిని, పద్మ, పాపారత్నం, హేమలత తదితరులు పాల్గొన్నారు.

పోలవరం: అంగన్వాడీల సమ్మెకు యూటీఎఫ్‌, ఎస్‌టీయూ ఉపాధ్యా య సంఘాలు సంఘీభావం తెలిపాయి. సమ్మె శిబిరంలో అంగన్వాడీలు గిరిజన నృత్యాలు చేశారు. పీఎల్‌ఎస్‌ కుమారి, చెరుకూరి మణి, పద్మ, సరస్వతి, హైమవతి, కుబ్ర, జుబేద, వెంకటరమణ, సత్యవతి పాల్గొన్నారు.

కుక్కునూరు: సమస్యలు పరిష్కరించకుండ నోటీసులు ఇవ్వడం సిగ్గు చేటని జనసేన నియోజకవర్గ ఇంచార్జి మేక ఈశ్వరయ్య అన్నారు. అంగన్వా డీల కోటి సంతకాల సేకరణ చేపట్టడంతో ఈశ్వరయ్య సంతకం చేశారు. కార్యక్రమంలో యర్నం సాయికిరణ్‌, కుంజ నాగలక్ష్మి, రమణ, సుజాత, పార్వ తి, మహాలక్ష్మి, వందన, మంగ, రాధ, జానకి, తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు టూటౌన్‌: అంగన్వాడీలు కొత్త కోర్కెలు కోరలేదని, జగన్‌ ఇచ్చిన హామీలనే అమలు చేయాలంటున్నారని రౌండ్‌ టేబుల్‌ సమావేశం లో వక్తలు పేర్కొన్నారు. అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి అధ్యక్షతన సమావేశం జరిగింది. నెలరోజులుగా రోడ్లపై అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె చేస్తుంటే కనీసం మహి ళలు అనే కనికరంలేకుండా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదన్నారు. సమస్యలు పరిష్కరించమంటే ఎస్మా చట్టం ప్రయోగించ డాన్ని ఖండించారు. అంగన్వాడీల సమ్మె బలపరుస్తూ కోటిసంతకాల సేకర ణలో రాజకీయపార్టీలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. బండి వెంకటేశ్వరరావు, చోడే వెంకటరత్నం, కాశీ నరేష్‌బాబు, వెంకట్రావు, రమేష్‌బాబు, షేక్‌ మ స్తాన్‌, డీఎన్‌వీడీ.ప్రసాద్‌, సోమయ్య, కిశోర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 11:58 PM