Share News

సమ్మె హోరు

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:09 AM

అంగన్‌వాడీ కార్యకర్తల సమ్మె గురువారం 31వ రోజుకు చేరుకుంది. నిరసన శిబిరంలో కార్యకర్తలు నినాదాలతో హోరె త్తించారు.

సమ్మె హోరు
లింగపాలెం శిబిరంలో అంగన్‌వాడీల కోలాటం

చింతలపూడి, జనవరి 11: అంగన్‌వాడీ కార్యకర్తల సమ్మె గురువారం 31వ రోజుకు చేరుకుంది. నిరసన శిబిరంలో కార్యకర్తలు నినాదాలతో హోరె త్తించారు. శిబిరంలో సీఐటీయు నాయకులు నత్తా వెంకటేశ్వరరావు మా ట్లాడుతూ అంగన్‌వాడీలు ప్రధానమైన మూడు సమస్యల పరిష్కారం సమ్మె, నిరసన కొనసాగిస్తున్నామన్నారు. తెలంగాణ కంటే అదనంగా రూ.వెయ్యి ఇస్తానన్న హామీ నెరవేర్చాలని, మినీ అంగన్‌వాడీ సెంటర్లను మెయిన్‌ సెం టర్లుగా గుర్తించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ చెల్లించాల న్నారు. కార్యకర్తలు శిబిరంలో నినాదాలు చేసి తమ ఐక్యతను చాటారు.

పోలవరం: అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ సమ్మె కొనసా గుతోంది. అంగన్వాడీలపై దీక్షలపై అణచివేత చర్యలు దుర్మార్గమని, నోటీసులు ఇచ్చి 18 వ తేదీలోగా విధులకు హాజరుకాకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని బెదిరింపులకు పాల్పడడం ప్రభుత్వానికి తగదని అంగన్వాడీల నాయకురాలు పిఎల్‌ఎస్‌ కుమారి అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. పద్మ, సరస్వతి, హైమవతి, కుబ్ర, జుబేద, వెంకటరమణ, సత్యవతి, విజయ తదితరులు పాల్గొన్నారు.

లింగపాలెం: తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో అంగన్‌వాడీల సమ్మె 31 రోజుకు చేరుకుంది. వీఆర్వోలు, గ్రామ కార్యదర్శులు, మహిళా కానిస్టేబుళ్ల ద్వారా నోటీసులు అందజేశారు. అంగన్‌వాడీలు నోటీసులు తీసుకోకపోవ డంతో అంగన్‌వాడీ కేంద్రాలు, అంగన్‌వాడీల గృహాలకు అంటించి వెళ్ళారు. తప్పనిసరిగా విధులకు హాజరుకావాలని హెచ్చరించినా ఎట్టిపరిస్థితుల్లోనూ సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. అంగన్‌వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం ప్రభుత్వ పిరికితనమని వారు ఎద్దేవా చేశారు. బీజేఎన్‌ కు మారి, వి.ఈశ్వరి, లింగపాలెం మండలంలోని అంగన్‌వాడీలు పాల్గొన్నారు.

బుట్టాయగూడెం: సమస్యలు పరిష్కరించేవరకు సమ్మె విరమించ బోమని అంగనవాడీలు స్పష్టం చేస్తున్నారు. కృపామణి, నూర్జహాన్‌, మున్నీ, శ్రీదేవి, రామమ్మ, రామలక్ష్మి, రామయమ్మ అంగనవాడీలు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 12:10 AM