Share News

పిడికిలి బిగించి..

ABN , Publish Date - Jan 04 , 2024 | 12:29 AM

అంగన్‌వాడీలు పిడికిళ్లు బిగించారు. ప్రభుత్వంతో అమీతుమీకి సిద్ధమయ్యారు. అరెస్టులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. భీమవరం మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి బైఠాయించారు.

పిడికిలి బిగించి..
ఏలూరు కలెక్టరేట్‌ వద్ద అంగన్‌వాడీల నినాదాలు

అంగన్‌వాడీల ఆందోళన

భీమవరం, ఏలూరు కలెక్టరేట్ల ధర్నాలు.. భారీగా హాజరు

ముందస్తు అరెస్ట్‌లతో పలుచోట్ల పోలీసుల అడ్డగింత

భీమవరంలో ఉద్రిక్తత.. పలువురి అరెస్ట్‌

ఏలూరు కలెక్టరేట్‌/ భీమవరం అర్బన్‌/భీమవరం క్రైం/, జనవరి 3 : అంగన్‌వాడీలు పిడికిళ్లు బిగించారు. ప్రభుత్వంతో అమీతుమీకి సిద్ధమయ్యారు. అరెస్టులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. భీమవరం మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి బైఠాయించారు. ఈ సందర్భంగా పోలీసులు అడ్డుకోవ డం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. 23 రోజులుగా చేస్తున్న సమ్మెలో భాగంగా ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ అంగన్‌ వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ పిలుపు మేరకు భీమవరంలో బుధవారం నిరసన సభ నిర్వహించారు. సభకు అనుమతి తీసుకున్నప్పటికీ తెల్లవారుజాము నుంచి సీఐటీ యూ నాయకులు, అంగన్‌వాడీ నాయకులను మొత్తం 150 మందిని అదుపులోకి తీసుకుని టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు, అక్కడి నుంచి జిల్లా రైస్‌ మిల్లర్స్‌ భవనానికి తరలించారు. విషయం తెలుసుకున్న మిగిలిన సిబ్బంది, నాయకులు ర్యాలీ గా ప్రకాశంచౌక్‌ చేరుకుని బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. కొన్ని వాహనాలు నిలిచిపోయా యి. భీమవరం డీఎస్పీ శ్రీనాథ్‌, సీఐలు జి.శ్రీనివాస్‌, సత్యనారాయణ సిబ్బంది కలిసి సీఐటీయూ నాయకులు వాసుదేవరావును, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జెక్కంశెట్టి సత్యనారాయణలను బలవంతంగా ఆటోలో స్టేషన్‌కు తరలించారు. దీంతో అంగన్‌వాడీ సిబ్బంది నినాదాలు చేశారు. అదు పులోకి తీసుకున్న నాయకులను వెంటనే వదిలి పెట్టాలని డిమాండ్‌ చేశారు. సీఎంతోపాటు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ప్రకాశం చౌక్‌ హోరెత్తింది. ఇక్కడి నుంచి లేవాలంటే ముందు అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని అంగన్‌వాడీలు స్పష్టం చేయడంతో పోలీసు లు వారిని విడుదల చేసి మునిసిపల్‌ ఆఫీసు వరకు ఊరేగిం పుగా వెళ్లి, సభ జరుపుకోవడానికి అనుమతి ఇచ్చారు.

సభకు అనుమతులిచ్చి అరెస్టులా ?

ప్రభుత్వం అబద్దపు మాటలతో అంగన్‌వాడీలను మోసగించిందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజారామ్మోహన్‌రాయ్‌ విమర్శించారు. మున్సిపల్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీ హెల్పర్స్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు ఝాన్సీలక్ష్మి అధ్యక్షతన బుధవారం జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అంగన్‌వాడీలు విధుల్లో చేరకపోతే తొలగిస్తామని అధికారులు బెదిరింపులకు దిగడం సరికాదని విమర్శించారు. సభ జరుపుకోవడానికి పోలిసులు అనుమతులు ఇచ్చి అరెస్టు చేయడం దారుణమ న్నారు. యుటీఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి గోపి మూర్తి, వివిధ సంఘాల నాయకులు జక్కంశెట్టి సత్యనారాయణ, కేవీపీఎస్‌కే క్రాంతిబాబు, సరోజిని, ఎం.రామాంజనేయులు ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు.

ఏలూరు కలెక్టరేట్‌ వద్ద మహాధర్నా

ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరి నిరసిస్తూ ఏలూరులో బుధవారం ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు గర్జించారు. భారీ ర్యాలీగా వచ్చి కలెక్టరేట్‌ వద్ద కదం తొక్కారు. న్యాయమైన డిమాండ్లు పరి ష్కరించాలని కోరుతూ 23 రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ వందలాది మంది ఏలూరు జూట్‌మిల్లు నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. కనీస వేతనం అమలుచేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలని నినాదాలు చేశారు. కలెక్టరేట్‌ వద్ద బైఠా యించారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ అంగన్‌వాడీలు సమ్మె చేస్తున్న జగన్‌ మొద్దునిద్ర నటిస్తున్నారని విమర్శించారు. జిల్లా అధ్యక్షుడు ఆర్‌.లింగరాజు, ప్రధాన కార్యదర్శి డి.ఎన్‌.వి.డిప్రసాద్‌, ఏఐటీ యూసీ నాయకులు కె.బుచ్చిబాబు మాట్లాడారు. పోలీసుల అక్రమ అరెస్టులకు నిరసనగా అంగన్‌వాడీలు కుక్కు నూరు లో ప్రదర్శన నిర్వహించారు. మరోవైపు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు సమ్మె విర మించి ఐదో తేదీలోగా విధులకు హాజరు కావాలని, శాఖా పరమైన చర్యలు తీసుకునే ఆలోచన చేయకుండా వ్యవహ రించాలని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ ఓ ప్రకటనలో కోరారు.

యూటీఎఫ్‌ 12 గంటల ధర్నా

ఏలూరు కలెక్టరేట్‌, జనవరి 3: ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపా ధ్యాయ ఫెడరేషన్‌ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఉపా ధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, ఒకటో తేదీన జీతా లు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ యూటీఎఫ్‌ ఏలూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద 12 గంటల ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు షేక్‌ ముస్తఫా ఆలీ అధ్యక్ష తన జరిగిన కార్యక్రమానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జేఏసీ చైర్మన్‌ చోడగిరి శ్రీనివాస్‌, కార్యదర్శి రామారావు పాల్గొని ధర్నా శిబిరాన్ని ప్రారంభించారు. యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్‌ రుద్రాక్షి మాట్లాడుతూ పాద యాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా జగన్‌ ప్రభుత్వం మాటతప్పి మడమ తిప్పిందన్నారు. అధికారం లోకి వచ్చిన తర్వాత ఒక్క డీఏ కూడా ఇవ్వకపోగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు రూ.20 వేల కోట్లు బకాయి పడింద న్నారు. రాష్ట్ర కార్యదర్శి డి.సుభాషిణి మాట్లాడుతూ పెండిం గ్‌ బకాయిలు చెల్లించని పక్షంలో ఈ నెల 9, 10 తేదీల్లో 36 గంటల ధర్నా నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యు లు పి.వి నరసింహారావు, యూటీఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షుడు ఎం.వి శ్యామ్‌బాబు, కనకదుర్గ, వెంకటేశ్వరరావు, రంగమో హన్‌, సాగర్‌ బాబు, వందలాది మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2024 | 12:29 AM