Share News

ఏలూరులో ‘అనన్య’ చిత్ర యూనిట్‌ సందడి

ABN , Publish Date - Mar 24 , 2024 | 12:48 AM

ఏలూరులో అనన్య చిత్రం యూనిట్‌ సభ్యులు శనివారం సందడి చేశారు. స్థానిక సాయిబాలాజి థియేటర్‌లో ఈ చిత్రం ప్రదర్శితమవుతోంది.

ఏలూరులో ‘అనన్య’ చిత్ర యూనిట్‌ సందడి
మాట్లాడుతున్న హీరో, హీరోయిన్‌

ఏలూరు కల్చెరల్‌, మార్చి 23 : ఏలూరులో అనన్య చిత్రం యూనిట్‌ సభ్యులు శనివారం సందడి చేశారు. స్థానిక సాయిబాలాజి థియేటర్‌లో ఈ చిత్రం ప్రదర్శితమవుతోంది. ఉదయం ఆట సమయంలో అనన్య చిత్రంలోని హీరో, హీరోయిన్లు ప్రేక్షకు లను ఉత్సాహపరిచారు. ఏలూరు మాదేపల్లి గ్రామానికి చెందిన జుత్తిగ జయరామన్‌ హీరోగా నటించారు. ప్రేక్షకులను సినిమా డైలాగులు చెప్పి అలరించారు. అనంతరం విలేకర్ల సమావే శంలో హీరో మాట్లాడుతూ ఈ చిత్రం కుటుంబసభ్యులందరిని అలరిస్తుందని, హర్రర్‌, ప్రేమ, కామెడీతో వినూత్నంగా రూపొందించామన్నారు. మరో హీరో సుమన్‌ ముఖ్యపాత్రలో పోషించారని, జబర్దస్త్‌ కమెడియన్లు కామెడీ ప్రేక్షకులను అలరిస్తుందన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాతో పాటు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రం షూటింగ్‌ చేశామన్నారు. హీరోయిన్‌ చందన మాట్లాడుతూ బంధుత్వాలు, బాంధవ్యాలతో కూడిన ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలన్నారు. డైరెక్టర్‌ బొమ్మిడి ప్రసాద్‌రాజు, నిర్మాత గంగాధర్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2024 | 12:49 AM