Share News

అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు పచ్చ జెండా

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:03 AM

ఎట్టకేలకు అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు పచ్చజెండా ఊపనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గుంటూరు నుంచి రిమోట్‌ ద్వారా వర్చువల్‌గా ఈ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభిస్తు న్నారు.

అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు పచ్చ జెండా

నరసాపురం టు హుబ్లీ..

నేడు ప్రారంభించనున్న మంత్రి కిషన్‌రెడ్డి

నరసాపురం, జనవరి 11: ఎట్టకేలకు అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు పచ్చజెండా ఊపనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గుంటూరు నుంచి రిమోట్‌ ద్వారా వర్చువల్‌గా ఈ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభిస్తు న్నారు. నరసాపురంలో ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, విజయవాడ రైల్వే డీఆర్‌ఎంతో జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్సీలు పాల్గొని ప్రారంభిస్తారు. చాలా ఏళ్లుగా ఈ ఎక్స్‌ప్రెస్‌ విజయవాడ నుంచి నడుస్తోంది. నరసాపురం–విజయవాడ మధ్య డబ్లింగ్‌ లైన్‌ పూర్తికావడంతో గతేడాది నవంబర్‌లో ఈ ఎక్స్‌ప్రెస్‌ను నరసాపురం వరకు పొడిగించారు. ఈ ఏడాది జనవరిలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ప్రయత్నించారు. అయితే మంత్రి బీజీగా ఉండటంతో ఏడాదిగా ఈ రైలుకు మోక్షం కలగలేదు. విజయవాడ నుంచి నడుస్తోంది. ఇటీవల ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంపై రైల్వే అధికారులతో పాటు జిల్లా బీజేపీ నాయకులు కూడా స్పందించారు. మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో శుక్రవారం కిషన్‌రెడ్డి గుంటూరులో షెడ్యూల్‌ సమాయానికి రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా రైలును ప్రారంభించనున్నారు.

షెడ్యూల్‌ ఇలా..

ఈ రైలు 17225 నంబర్‌తో మధ్యాహ్నం 3 గంటలకు నరసాపురంలో బయ లుదేరి విజయవాడ, గుంటూరు, మార్కాపురం, నంద్యాల, గుంతకల్‌, బళ్లారి, హోస్పేట మీదుగా మరుసటి రోజు ఉదయం 11.20కి హుబ్లీ చేరుకుంటుంది. తిరిగి 1.20లకు 17226 నంబర్‌తో హుబ్లీలో బయలుదేరి మరుసటి ఉదయం 7 గంటలకు నరసాపురం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విజయ వాడకు 5.15 గంటలకు వస్తుంది. జిల్లాలో పాలకొల్లు, భీమవరం టౌన్‌, జంక్షన్‌, ఆకువీడు, కైకలూరు స్టేషన్లలో ఆగనుంది.

గోవా వెళ్లేవారికి..

గోవా వెళ్లే ప్రయాణికులు నేరుగా ఈ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్ళవచ్చు. కొన్ని బోగీలు హుబ్లీలో వేరు చేసి హైద్రాబాద్‌ నుంచి వచ్చే ఎక్స్‌ప్రెస్‌కు జత చేస్తారు. తిరుగు ప్రయాణంలోనూ గోవాలో హైద్రాబాద్‌ వెళ్లే ఎక్స్‌ప్రెస్‌కు జత చేసి హుబ్లీలో వాటిని అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు కలుపనున్నారు. దీనివల్ల రైలుమారే అవకాశం ఉండదు. జిల్లా నుంచి కర్ణాటక, రాయలసీమ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ రైలు సౌకర్యవంతంగా ఉంటుంది.

Updated Date - Jan 12 , 2024 | 12:03 AM