Share News

అల్లూరి చిరస్మరణీయుడు

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:44 AM

అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర పోరాట స్పూర్తి చిరస్మరణీయమని ఎమ్మెల్యే డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ అన్నారు. సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా భుజబలపట్నంలో క్షత్రియ యూత్‌ ఆధ్వర్యంలో గురువారం అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. క్షత్రియ సేవా సంఘం నాయ కులు పేరిచర్ల రామ రాజు, జంపన రాము, గాదిరాజు భాస్కరరాజు, ఆర్‌వీ సూర్యనారాయణ రాజు, అల్లూరి కృష్ణమోహనరాజు, ముదనూరి సీతారామ రాజు, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠలరావు పాల్గొన్నారు.

అల్లూరి చిరస్మరణీయుడు
సీతారామరాజు జయంతి

ఘనంగా సీతారామరాజు జయంతి వేడుకలు

కైకలూరు, జూలై 4: అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర పోరాట స్పూర్తి చిరస్మరణీయమని ఎమ్మెల్యే డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ అన్నారు. సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా భుజబలపట్నంలో క్షత్రియ యూత్‌ ఆధ్వర్యంలో గురువారం అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. క్షత్రియ సేవా సంఘం నాయ కులు పేరిచర్ల రామ రాజు, జంపన రాము, గాదిరాజు భాస్కరరాజు, ఆర్‌వీ సూర్యనారాయణ రాజు, అల్లూరి కృష్ణమోహనరాజు, ముదనూరి సీతారామ రాజు, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠలరావు పాల్గొన్నారు.

ముదినేపల్లి :మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు పోరాట పటిమ, ఆత్మస్థైర్యం నేటి యువతకు ఆదర్శం కావాలని కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ అన్నారు. రాజానగరం గ్రామంలో క్షత్రియ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం అల్లూరి సీతా రామరాజు జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. సంఘ నాయకులు కొండ రాజు, సుబ్బరాజు, రవిరాజుతో పాటు పలువురు టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నా రు. గురజ గ్రామంలో కొండ దొరల లొకాలిటీలోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు వీరమల్లు నరసింహారావు, కొడాలి వినోద్‌, శ్రీహరిపురం సర్పంచ్‌ పరసా విశ్వేశ్వరరావు, బీజేపీ, జనసేన నాయకులు కోటప్రోలు కృష్ణారావు, వీరంకి వెంకటేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

కలిదిండి : తాడినాడలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమా లలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నంబూరి వెంకట రామరాజు, సూర్యనారాయణ రాజు, సుబ్బరాజు, నరసింహరాజు పాల్గొన్నారు. కలిదిండిలో ప్రజా సంఘాల కార్యాలయంలో సీపీఎం నాయకులు అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహంకాళిరావు, మహేష్‌, రాజేష్‌, పాల్గొన్నారు. భాస్కరావుపేట, కొండంగి గ్రామాల్లో అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు పూలమా లలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రామ రాజు, కోకా రమేష్‌, సతీష్‌ రాజు పాల్గొన్నారు. కలిదిండి గ్రంథాలయంలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర సమర యోధుడు మన అల్లూరి అనే అంశంపై విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించారు. గ్రంథాలయాధికారి జె.రమేష్‌బాబు పాల్గొన్నారు.

చాట్రాయి : మండలంలోని చిన్నంపేట సెంటర్‌లో, తుమ్మగూడెం ఉర్ధూ పాఠశాలో అల్లూరి సీతారామరాజు జయంతిని ఘనంగా నిర్వహించారు. చిన్నంపేట సిద్ధార్థ హైస్కూల్‌ నుంచి సెంటర్‌ వరకు విద్యార్థులు, పౌరులు ర్యాలీ నిర్వహించి అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తుమ్మగూడెం ఉర్ధూ పాఠశాలలో అల్లూరి చిత్రపటానికి హెచ్‌ఎం వెంకట్రావు విద్యార్థులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. వక్తలు మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం మన్యం సేనలతో బ్రిటీష్‌ దొరలపై అల్లూరి చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. కార్యక్రమంలో సిద్ధార్థ హైస్కూల్‌ ప్రిన్సిపాల్‌ పలగాని శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కొమ్ము ఆనందం, యువజన సంఘం మండల నాయకుడు లింగోజు వంశీ పాల్గొన్నారు.

మండవలి : భైరవపట్నంలో అల్లూరి సీతారామ రాజు జయంతిని పురస్కరించుకుని విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళుల ర్పించారు. పెన్మెత్స నరసింహరాజు, గాదిరాజు భాస్కర వర్మ, కనుమూరి శ్రీని వాసరాజు, వేగేశ్న సుబ్బరాజు, రుద్రరాజు శివకుమార్‌రాజు, అల్లూరి కృష్ణంరాజు, అల్లూరి సత్యనారాయణరాజు, పెన్మెత్స ప్రసన్న, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 12:44 AM