Share News

భూహక్కు చట్టాన్ని రద్దు చేయాలి

ABN , Publish Date - Jan 28 , 2024 | 11:52 PM

వ్యవసాయ కార్మికులు, దళి తులు, గిరిజనులకు, సామాన్య ప్రజలకు తీవ్ర నష్టం కలిగించే భూ యాజమాన్య హక్కుల చట్టం, అసైన్డ్‌భూముల చట్టం సవరణను రద్దు చేయాలని కార్మిక, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

భూహక్కు చట్టాన్ని రద్దు చేయాలి
రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో నాయకుల అభివాదం

కార్మిక, ప్రజాసంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం

ఏలూరు టూటౌన్‌, జనవరి 28: రైతులు, వ్యవసాయ కార్మికులు, దళితులు, గిరిజనులకు, సామాన్య ప్రజలకు తీవ్ర నష్టం కలిగించే భూ యాజమాన్య హక్కుల చట్టం, అసైన్డ్‌భూముల చట్టం సవరణను రద్దు చేయాలని కార్మిక, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం అన్నే భవన్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. పలువురు నాయకులు మాట్లాడుతూ భూ యాజమాన్య హక్కుల చట్టంలో ప్రమాదకరమైన నిబంధనలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ భూములు, నివాస స్థలాలు, భవనాలు, ఇతర స్థిరాస్థులపై హక్కులు నిర్ధారించి టైటిల్‌ రిజిస్టర్‌లో నమోదు చేసే అధికారాన్ని రెవెన్యూ అధికారులకు కట్టబెట్టడం మంచిది కాదన్నారు. కోర్టులు జోక్యం చేసుకునే అధికారం లేకుండా చేశారన్నారు. జగన్‌ ప్రభుత్వం ప్రధాని మోదీకి లొంగిపోయి రాష్ట్రంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా చట్టాన్ని అమలు చేయడం దుర్మార్గమన్నారు. ఈ నిబంధనల వలన రైతుల భూముల్లో కార్పొరేట్‌ కంపె నీలకు అత్యంత సులభంగా కట్టబేట్టేందుకు వీలు కలుగుతుందన్నారు. భూ సమస్యలు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అసైన్డ్‌ భూ ముల చట్ట సవరణ ఆర్డినేన్స్‌ రద్దు చేసి 2013 భూసేకరణ చట్టాన్ని యధావిధిగా అమలు చేయాలన్నారు. చట్టం రద్దు చేయాలని ఈ నెల 31న కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహిస్తామన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు ఎ.రవి, బీకేఎంయూ ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్‌ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహనరావు, లాయర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు శైలజ, అంబేడ్కర్‌ మిషన్‌ అధ్యక్షుడు ఎం.సంతోష్‌కుమార్‌, ఎస్సీ, ఎస్టీసెల్‌, విజిలెన్స్‌ మానటరింగ్‌ మాజీ సభ్యుడు నేతర అజయ్‌బాబు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ డాంగే తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 28 , 2024 | 11:52 PM