Share News

తాడేపల్లిగూడెంలో ఎయిర్‌పోర్టు!

ABN , Publish Date - Aug 19 , 2024 | 12:46 AM

ఉమ్మడి పశ్చిమ గోదావరికి నడిబొడ్డున ఉన్న తాడేపల్లి గూడెంలో విమానాశ్రయం నిర్మించాలన్న ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. సీఎం చంద్రబాబునాయుడు ఇటీవల ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే పది విమానాశ్రయాలపై ఆ శాఖ మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడుతో చర్చించారు.

 తాడేపల్లిగూడెంలో ఎయిర్‌పోర్టు!

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి పశ్చిమ గోదావరికి నడిబొడ్డున ఉన్న తాడేపల్లి గూడెంలో విమానాశ్రయం నిర్మించాలన్న ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. సీఎం చంద్రబాబునాయుడు ఇటీవల ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే పది విమానాశ్రయాలపై ఆ శాఖ మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడుతో చర్చించారు. ఇందులో తాడేపల్లిగూడెం ఒకటి. జిల్లాలో విమానాశ్రయం అవసరాన్ని దశాబ్దాల క్రితమే గుర్తిం చారు. కానీ ఆచరణకు నోచుకోలేదు. నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో తాడేపల్లిగూడెం విమానాశ్రయ భూముల్లో 400 ఎకరాలు కేటాయించారు. నిర్మాణం కోసమని ఓ కంపెనీకి బాధ్యతలు అప్పగించారు. సర్వే కూడా చేపట్టారు. తర్వాత ఆ ప్రతిపాదన తెరమరుగైంది. అనంతరం 2014లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తాడేపల్లిగూడెంలో విమానాశ్రయాన్ని నిర్మిస్తామంటూ ప్రకటించారు. బ్రిటీష్‌ కాలంలో తాడేపల్లిగూడెంలో నిర్మించిన ఎయిర్‌స్ర్టిప్‌ భూము లను పరిశీలించారు. పౌర విమానాశాయ శాఖ నుంచి బృం దం ఇక్కడ సర్వే నిర్వహించింది. ఆ తర్వాత అదే భూముల్లో నిట్‌ ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. ఒక వైపు నిట్‌, మరో వైపు విమానాశ్రయం ఊరిస్తూ వచ్చింది. చివరకు అప్పటి ప్రజా ప్రతినిధులు పైడికొండల మాణిక్యాలరావు, బొలిశెట్టి శ్రీనివాస్‌ ఏపీ నిట్‌ వైపే మొగ్గు చూపారు. ఒక దశలో ఏలూరు తరలిపోయిన నిట్‌ను తాడేపల్లిగూడెంలో ఉంచేలా కేంద్ర స్థాయిలో పావులు కదిపారు. చివరకు విమానాశ్రయ భూముల్లో ఏపీ నిట్‌ ఏర్పడింది.

తాడేపల్లిగూడెం పరిధిలో తాజాగా అటవీ, రెవెన్యూ భూములు అందుబాటులో ఉన్నాయి. అటవీ భూములు కేటా యించాలంటే అటవీ శాఖకు మూడు రెట్లు రెవెన్యూ భూమి ఇవ్వాలి. తెలుగుదేశం గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఆ దిశగా చర్యలు తీసుకున్నారు. తాజాగా విమానాశ్రయం ఏర్పా టు చేయాలంటే వెంకట్రామన్నగూడెం వద్ద అటవీ, రెవెన్యూ భూములు అక్కరకు రానున్నాయి. ఇప్పటికే తాడేపల్లిగూడెం నుంచి వెంకట్రామన్నగూడెం వరకు నాలుగు లైన్‌ల రహదారి విస్తరించింది. భీమవరం నుంచి తాడేపల్లిగూడెం వరకు జాతీయ రహదారి ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమవుతు న్నాయి. ఇప్పటికే కేంద్రం భీమవరం–తాడేపల్లిగూడెం రహ దారికి జాతీయ హోదానిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి పాదనలు వెళ్లాలి. భూసేకరణ నిర్వహించాలి. జాతీయ రహ దారిగా విస్తరిస్తే భీమవరం–తాడేపల్లిగూడెం మధ్య రాకపో కలు మరింతగా విస్తరించనున్నాయి. తాడేపల్లిగూడెంలో విమానాశ్రయం ఏర్పడితే భీమవరం ప్రాంత ప్రజలకు అను వుగా ఉంటుంది.

అందరికీ ఉపయోగం

తాడేపల్లిగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుంది. అటు రావులపాలెం నుంచి ఇటు ఏలూరు దగ్గర వరకు, భీమవరం నుంచి జంగారెడ్డిగూడెం వరకు ఉపయోగకరంగా ఉంటుంది. తాడేపల్లిగూడెం ఉమ్మడి పశ్చిమలోని అన్ని ప్రాంతాల నుంచి జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు విస్త రించాయి. జాతీయస్థాయిలో ఏపీ నిట్‌, ఉద్యాన విశ్వ విద్యాలయాలకు విమానాశ్రయం అనుకూలం. ఉద్యాన ప్రాజెక్ట్‌లకు దీనిని ఒక ప్రామాణికంగా తీసుకుంటారు. ఒక దశలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఫ్లోరీకల్చర్‌ను వెంకట్రామ న్నగూడెంలో ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయాలని సంకల్పించారు. అయితే విమానాశ్రయం ఉండాలంటూ కేంద్రం అప్పట్లో స్పష్టం చే సింది. ఇందు కోసం అటు గన్నవరం, ఇటు రాజమండ్రి విమానాశ్ర యాలను చూపించారు. చివరి దశలో డైరెక్టరేట్‌ ఫ్లోరీ కల్చర్‌ మహారాష్ట్రకు తరలిపోయింది. భవిష్యత్తులో ఏపీ నిట్‌ విస్తరణతో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. ప్రముఖులు, విదేశీ విద్యార్థుల రాకపోకలు అధికం కానుంది. వీరందరికీ తాడేపల్లిగూడెంలో విమానా శ్రయం అనువుగా ఉంటుంది.

Updated Date - Aug 19 , 2024 | 12:46 AM