ఆగి వున్న లారీని ఢీకొన్న ట్రావెల్ బస్సు
ABN , Publish Date - Jul 28 , 2024 | 12:09 AM
జయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని అమ్మ వారికి పసుపు–కుంకుమ సమర్పించేందుకు వారంతా యాత్రగా బస్‌లో బయలుదేరారు. ఏలూరు జిల్లా పెదపాడు మండలం కలపర్రు టోల్‌గేట్ సమీపంలో జాతీయ రహదారిపై శనివారం ఉదయం వారు ప్రయా ణిస్తున్న ట్రావెల్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి.

వృద్ధురాలి మృతి.. పలువురికి గాయాలు
పెదపాడు, జూలై 27 :విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని అమ్మ వారికి పసుపు–కుంకుమ సమర్పించేందుకు వారంతా యాత్రగా బస్‌లో బయలుదేరారు. ఏలూరు జిల్లా పెదపాడు మండలం కలపర్రు టోల్‌గేట్ సమీపంలో జాతీయ రహదారిపై శనివారం ఉదయం వారు ప్రయా ణిస్తున్న ట్రావెల్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. మన్యం జిల్లా పార్వతీపురానికి చెందిన 29 మంది ఆషాడమాసంలో అమ్మవారిని దర్శించుకునేందుకు అంతా కలిసి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో శుక్రవారం సాయంత్రం బయలు దేరారు. తెల్లవారు జాము 5.30 గంటల ప్రాంతంలో కలపర్రు వద్ద జాతీయ రహదారిపై హోటల్ ముందు ఆగి ఉన్న లారీని బస్ అతివేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో పెద్దూరు గ్రామం, గురుపల్లి మండలం, పార్వతీ పురం మన్యం జిల్లాకు చెందిన ముగడ కృష్ణమ్మ (60) అక్కడికక్కడే మృతి చెందగా బస్ డ్రైవర్ కిలారి లక్ష్మణరావుకు కాలిలో ఇనుపచువ్వ బలంగా దిగబడింది. బస్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను బయటకు తీసేం దుకు పోలీసులతో పాటు పలువురు తీవ్రంగా శ్రమించారు.గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతి రాలి బంధువు హరిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కె.శుభశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కలెక్టర్ ఆదేశాలతో ఏలూరు ఆర్డీవో ఖాజావలి, పెదపాడు ఎమ్మార్వో భావనారాయణ, ఏలూరు ఎమ్మారో మురార్జీ ఏలూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 16 మంది స్వల్ప గాయాలవగా వారంద రికీ ప్రాథమిక చికిత్స చేయించి వారందరిని స్వస్ధలానికి వెళ్ళేలా వాహనాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు.