Share News

అన్నప్రాసన రోజే అనంతలోకాలకు...

ABN , Publish Date - Jun 09 , 2024 | 11:40 PM

ఆరు నెలలు నిండకుండానే ఆ చిన్నారికి నూరేళ్లు నిండాయి. చిన్నారి అన్న ప్రాసన కోసం వచ్చిన అమ్మమ్మ కూడా మృతి చెంద డం గ్రామస్తులను కంటతడి పెట్టించింది.

అన్నప్రాసన రోజే అనంతలోకాలకు...

రోడ్డు ప్రమాదంలో బాలుడితో సహా అమ్మమ్మ మృతి

ఎనిమిది మందికి గాయాలు

నూజివీడు టౌన్‌, జూన్‌ 9: ఆరు నెలలు నిండకుండానే ఆ చిన్నారికి నూరేళ్లు నిండాయి. చిన్నారి అన్న ప్రాసన కోసం వచ్చిన అమ్మమ్మ కూడా మృతి చెంద డం గ్రామస్తులను కంటతడి పెట్టించింది. మచిలీపట్నం చిన్నాపురానికి చెందిన బొందిలి నాగరాజు మనుమడు హియాన్‌ సాయిసింగ్‌ అన్నప్రాసనకు తన తండ్రిగారి ఊరైన ఏలూరు జిల్లా నూజివీడుకు వచ్చి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడితో పాటు అతని అమ్మమ్మ మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయాలపాలైన ఘటన నూజివీడు మండలం గొల్లపల్లి లో చోటు చేసుకుంది. హియాన్‌ సాయిసింగ్‌ అన్నప్రాసనను ఆదివారం నూజి వీడులో నిర్వహించారు. అన్నప్రాసన పూర్తి అయిన అనంతరం ఆటోలో తిరిగి చిన్నాపురం వెళుతుండగా మృత్యు రూపంలో వచ్చిన బొలేరో వీరు ప్రయాణి స్తున్న ఆటోను గొల్లపల్లి వద్ద బలంగా ఢీ కొట్టింది. దీంతో చిన్నారి హియాన్‌ సాయిసింగ్‌ (ఆరు నెలలు)తో పాటు బొందిలి సునీతా బాయ్‌ (48) ఘటనా స్థలంలోనే మృతి చెందారు. వీరితో పాటు చిన్నాపురానికి చెందిన బొందిలి నాగ రాజు, బొందిలి సునీత, బొందిలి సంతోషి బాయి, బొందిలి హిమాబాయ్‌, క్షత్రియ శైలజా బాయ్‌, ఆటోడ్రైవర్‌ మూర్ల నాగరాజు, పాముల భరత్‌కుమార్‌ తీవ్రంగా గాయపడగా వారిని నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రథ మ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడకు రిఫర్‌ చేశారు.

పలుమార్లు ఢీ కొన్న బొలేరో..

బొలేరో డ్రైవర్‌ మద్యం మత్తులో వేగంగా వాహనాన్ని నడుపుతూ ఆటోను ఢీకొన్నాడు. పల్టీకొట్టిన ఆటోను పలుమార్లు బొలేరో వాహనం ఢీకొని ముందుకు వెళ్లినట్టు స్థానికులు చెబుతున్నారు. ఫలితంగానే చిన్నారి, అమ్మమ్మ సునీతాబా యి మృతి చెందారని పేర్కొంటున్నారు. ఈ ఘటనా స్థలం పక్కనే ఉన్న చికెన్‌ కొట్టు వద్దకు వచ్చిన వేంపాడుకు చెందిన పామర్తి ధనుష్‌ సైతం గాయపడ్డాడు. నూజివీడు రూరల్‌ సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jun 10 , 2024 | 11:15 AM