Share News

46 మంది ముస్లిం యువత రక్తదానం

ABN , Publish Date - Jan 28 , 2024 | 12:35 AM

సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ముస్లిం యువత రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని జామియా మసీద్‌ కమిటీ ప్రెసిడెంట్‌ ఎండీ జిలానీ బాషా అన్నారు.

 46 మంది ముస్లిం యువత రక్తదానం
కైకలూరు ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో రక్తదానం చేస్తున్న యువత

కైకలూరు, జనవరి 27: సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ముస్లిం యువత రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని జామియా మసీద్‌ కమిటీ ప్రెసిడెంట్‌ ఎండీ జిలానీ బాషా అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కైకలూరులో శనివారం ముస్లిం యువత (ఈద్గా కమిటీ), కైకలూరు ప్రభుత్వాసుపత్రి సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 46 మంది యువత రక్తదానం చేశారు. అలాగే రోగులకు బీపీ, షుగరు పరీక్షలు చేసి ఉచితంగా చూసి మందులు పంపిణీ చేశారు. రక్తదాన శిబిరాన్ని షేక్‌ ఇస్మాయిల్‌ ప్రారంభించారు. కమిటీ సభ్యులు ఎండీ జహీర్‌, ఇలా ఉల్‌ హక్‌, ఈద్గా కమిటీ ప్రెసిడెంట్‌ గఫూర్‌ఖాన్‌, సెక్రటరీ అమీర్‌, మహ్మద్‌ జానీ, సయ్యద్‌ బాషీద్‌, ఎండీ ఉస్మాన్‌, షేక్‌ షరీఫ్‌, మూసా, ఎండీ గాలిబ్‌, ఎండీ రఫీబాషా, షేక్‌ రఫీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 28 , 2024 | 12:35 AM