15న జాబ్‌మేళా
ABN , Publish Date - Jun 12 , 2024 | 11:37 PM
జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, ప్రభు త్వ యువజన సర్వీస్‌లశాఖ, సెట్‌వెల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 15న కలెక్టరేట్ కాంపౌండ్‌లోని సెట్‌వెల్ కార్యాలయంలో ఉదయం పది గంటలకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి కల్పనాధికారి సి.మఽధుభూషణ రావు ఓ ప్రకట నలో పేర్కొన్నారు.

ఏలూరు కలెక్టరేట్, జూన్ 12 : జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, ప్రభు త్వ యువజన సర్వీస్‌లశాఖ, సెట్‌వెల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 15న కలెక్టరేట్ కాంపౌండ్‌లోని సెట్‌వెల్ కార్యాలయంలో ఉదయం పది గంటలకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి కల్పనాధికారి సి.మఽధుభూషణ రావు ఓ ప్రకట నలో పేర్కొన్నారు. స్పందన, స్ఫూర్తి ఫైనాన్స్ లిమిటెడ్‌లో ఉద్యోగానికి సంబం ధించి ఇంటర్వూ జరుగుతుందన్నారు. బిజినెస్ డెవలప్ మెంట్ ఎగ్జిక్యూటివ్స్ పురుషులకు రూ.12,500 నుంచి ప్రారంభమై బదిలీ అలవెన్స్, ఇన్‌సెంటివ్స్, ఉచిత భోజన, వసతి సౌకర్యం, ఆరోగ్యబీమా రూ.4 లక్షలు, ప్రమాదబీమా రూ.20 లక్షలు ఇవ్వబడుతుందన్నారు. ఇంటర్, డిగ్రీ విద్యార్హతలు.. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో అనుభవం ఉండాలని, 21 నుంచి 27 ఏళ్ళ లోపు వయసు, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్నారు. హను మాన్‌జంక్షన్ సమీపంలోని మల్లవల్లి వద్ద నున్న మోహన్ స్పిన్‌టెక్స్‌లో ఉద్యోగం కోసం గార్డ్‌లు పురుషులకు రూ.11 వేల నుంచి రూ.13వేలు జీతం. 8వ తరగతి నుంచి డిగ్రీ చదివిన వారు అర్హులన్నారు. వివరాలకు 88868 82032 నంబరులో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.