Share News

25న టెన్త్‌ ఫలితాలు ?

ABN , Publish Date - Apr 07 , 2024 | 12:21 AM

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు ఈ నెల 25న ప్రకటించే వీలున్నట్టు జిల్లా విద్యాశాఖ వర్గాల నుంచి సంకేతాలు అందుతున్నాయి. అయితే ఫలితాల విడుదలపై ఇంతవరకు అధికారిక ప్రకటన ఏదీలేదు.

25న టెన్త్‌ ఫలితాలు ?

నేటితో ముగియనున్న మూల్యాంకనం

ఏలూరు ఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 6 : పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు ఈ నెల 25న ప్రకటించే వీలున్నట్టు జిల్లా విద్యాశాఖ వర్గాల నుంచి సంకేతాలు అందుతున్నాయి. అయితే ఫలితాల విడుదలపై ఇంతవరకు అధికారిక ప్రకటన ఏదీలేదు. ప్రస్తుతం జరుగుతున్న మూల్యాంకన ప్రక్రియలో 95 శాతం ఆదివారం మధ్యాహ్నానికి ముగియనుండగా, మిగతా తెలుగు ఫస్ట్‌ లాంగ్వేజి, హిందీ జవాబు పత్రాల మూల్యాంకనం సోమవారంతో పూర్తవుతుందని అధికార వర్గాలు వివరించాయి. ఏదైనా సాంకేతిక కారణం ఎదురైతే ఈనెల 30వ తేదీలోగా ఫలితాలను వెల్లడిస్తారని పేర్కొన్నా యి. ఎన్నికల కమిషన్‌ అనుమతి తీసుకున్న తర్వాతే ఫలితా లను విడుదల చేస్తారు. జవాబు పత్రాల మూల్యాంకనకు గతేడాది పెంచిన రేట్ల ప్రకారమే బడ్జెట్‌ నిధులు విడుదల కాగా, స్పాట్‌ వాల్యూయేషన్‌ ముగిసిన వెంటనే సంబంధిత సిబ్బంది బ్యాంకు ఖాతాలకు పారితోషకాన్ని జమ చేయడా నికి ఏర్పాట్లు చేశారు. ఒక్కో జవాబు పత్రం మూల్యాం కనానికి రూ.6.60 పైసల నుంచి పది రూపాయలకు పెంచిన విషయం తెలిసిందే. కాగా గతేడాది బకాయి పడిన టీఏ, డీఏ చెల్లింపులకు రూ.30 లక్షలు నిధులు విడుదల కావడం తో గురువారమే టీచర్ల బ్యాంకు ఖాతాలకు జమ చేసినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు ఏపీ ఓపెన్‌ స్కూల్స్‌ దూర విద్య ఇంటర్మీడియట్‌ పరీక్షల జవాబు పత్రాల మూల్యాం కనను ఈ నెల 13 నుంచి 17 వరకు సెయింట్‌ గ్జేవియర్‌ హైస్కూలు క్యాంపులో నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్టు డీఈవో అబ్రహం తెలిపారు.

Updated Date - Apr 07 , 2024 | 12:21 AM