Share News

ముగిసిన ‘పది’ ప్రధాన పరీక్షలు

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:38 AM

పదో తరగతి ప్రధాన పరీక్షలు బుధ వారం ముగిశాయి. అతి తక్కువమంది విద్యార్థులు రాసే ఒకేషనల్‌ పరీక్షలు ఈ నెల 30తో ముగుస్తాయి.

ముగిసిన ‘పది’ ప్రధాన పరీక్షలు
పెదవేగిలో పరీక్ష రాసి బయటకు వస్తున్న విద్యార్థులు

1 నుంచి జవాబు పత్రాల మూల్యాంకన

ఏలూరు ఎడ్యుకేషన్‌, మార్చి 27 : పదో తరగతి ప్రధాన పరీక్షలు బుధ వారం ముగిశాయి. అతి తక్కువమంది విద్యార్థులు రాసే ఒకేషనల్‌ పరీక్షలు ఈ నెల 30తో ముగుస్తాయి. బుధవారం జరిగిన సాంఘిక శాస్త్రం పరీక్షకు ఏలూరు జిల్లాలో 23,813 మంది రెగ్యులర్‌ విద్యార్థులు రాయాల్సి ఉండగా 23,024 మంది హాజరయ్యారని, మరో 2,874 మంది ప్రైవేటు విబాగం విద్యార్థులకు గాను 1,232 మంది హాజరయ్యారని డీఈవో అబ్రహం తెలి పారు. ఏలూరులోని పలు పరీక్షా కేంద్రాలను ప్రభుత్వ పరిశీలకుడు ఆర్‌.నర సింహారావుతో పాటు, డీఈవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎక్కడా మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాలేదని వివరించారు. జవాబుపత్రాల మూల్యాం కనను ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ఏలూరు సెయింట్‌ గ్జేవియర్‌ హైస్కూలులో ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసారు. వివిధ జిల్లాల నుంచి రెండు లక్షల ఆన్సర్‌ స్ర్కిప్ట్‌లు అన్ని సబ్జెక్టుల నుంచి పంపారు. తొలుత నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం స్పాట్‌ వాల్యూయేషన్‌ను వచ్చేనెల 8న ముగించాల్సి వున్నప్పటికీ ఒకరోజు ముందు గానే పూర్తిచేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. మూల్యాంకన విధులకు నియమితులైన సిబ్బందికి నియామక పత్రాలను ఇప్పటికే జారీచేశారు.

భీమవరం ఎడ్యుకేషన్‌ : పశ్చిమ గోదావరి జిల్లాలో 127 పరీక్షా కేంద్రాలలో 21,511 విద్యార్థులకు గాను 20,752 మంది హాజరవగా 759 మంది గైర్హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖాధికారి ఆరు పరీక్షా కేంద్రాలను, ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ 45 పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఏ విధమైన మాస్‌ కాపీయింగ్‌ నమోదు కాలేదని డీఈవో వెంకటరమణ తెలిపారు. వీరవాసరంలో జడ్పీ హైస్కూల్‌లో ఏప్రిల్‌ 1 నుంచి జవాబు పత్రాల మూల్యాంకన జరుగుతుంది.

Updated Date - Mar 28 , 2024 | 12:38 AM