Share News

AP News: నా జోలికి వస్తే వదలను.. ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డికి ముఖ్య అనుచరుడి వార్నింగ్

ABN , Publish Date - Jan 27 , 2024 | 01:50 PM

కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై ఆయన ముఖ్య అనయచరుడు సూరా శ్రీనివాసులురెడ్డి, ఇతరు అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP News: నా జోలికి వస్తే వదలను.. ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డికి ముఖ్య అనుచరుడి వార్నింగ్

నెల్లూరు: కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై ఆయన ముఖ్య అనుచరుడు సూరా శ్రీనివాసులురెడ్డి, ఇతర అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ప్రసన్న ముఖ్య అనుచరుడు సూరా మాట్లాడుతూ.. ప్రసన్న ఓ నియంత అని.. తన జోలికొస్తే వదిలిపెట్టబోనన్నారు. తనకు బార్ ఉందని.. దాని నుంచి ప్రతినెలా రెండు లక్షలు ఎమ్మెల్యే ప్రసన్నకు పంపిస్తున్నానన్నారు. ఇరవై ఐదేళ్లు ప్రసన్నతోనే ఉన్నందుకు తనపై అక్రమ కేసులు బనాయించారన్నారు.

తన భార్యాబిడ్డల ఉసురు ఎమ్మెల్యే ప్రసన్నకు తగులుతుందని సూరా శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎమ్మెల్యే ప్రసన్న.. జిల్లాలో పేరుగాంచిన నల్లపురెడ్డి కుటుంబం పరువు తీశాడన్నారు‌. వైసీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ఇంట్లోనే తనను అరెస్టు చేశారన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే ఇది న్యాయమా? అని ప్రసన్న ప్రశ్నించారు. 2019లో ఎమ్మెల్యే ప్రసన్న చేసిన అప్పులను తాను కట్టానని.. తాను నోరు విప్పితే అందరి చరిత్ర బయట పెడతానన్నారు. టీడీపీలో చేరాలని తాను అనుకోలేదని.. తన అనుచరుల నిర్ణయమే తన నిర్ణయమని సూరా శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Jan 27 , 2024 | 02:50 PM