జడ్పీ ముట్టడి
ABN , Publish Date - Oct 25 , 2024 | 11:57 PM
రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా పెండింగ్‌లో వున్న వసతి దివెన, విద్యా దీవెన నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో శుక్రవారం జడ్పీని ముట్టడించారు.

జడ్పీ ముట్టడి
మంత్రులు, ఎమ్మెల్యేల హామీలతో ఆందోళన విరమించిన విద్యార్థులు
విజయనగరం దాసన్నపేట, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా పెండింగ్‌లో వున్న వసతి దివెన, విద్యా దీవెన నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో శుక్రవారం జడ్పీని ముట్టడించారు. పెండింగ్‌లో వున్న ఉపకారవేతనాల నిధులు విడుదల చేయాలని కోరుతూ కలెక్టరేట్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా జడ్పీ కార్యాలయం వరకూ భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు డి.రాము మాట్లాడుతూ, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు గత రెండేళ్ల కాలంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వని పరిస్థితి దాపురించిందన్నారు. ఫీజులు చెల్లిస్తేనే పరీక్షకు అనుమతిస్తామని యాజమాన్యాలు బెదిరింపులతో విద్యార్థులు రోడెక్కాల్సి వస్తోందన్నారు. విద్యార్థుల ఆందోళన గురించి తెలుసుకున్న మంత్రులు జడ్పీ మీటింగ్ నుంచి బయటకు వచ్చి విద్యార్థులతో మాట్లాడారు. వినతిపత్రాన్ని స్వీకరించారు. దీంతో వారంతా శాంతించారు.
===============