Share News

యువత చదువుపై దృష్టి సారించాలి

ABN , Publish Date - Jul 08 , 2024 | 12:11 AM

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, విద్యార్థులకు సంబంధించి ఎలాంటి పథకాలు ఆగవు.. చదువులపై దృష్టి సారించాలని రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కోరారు.

యువత చదువుపై దృష్టి సారించాలి

సాలూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, విద్యార్థులకు సంబంధించి ఎలాంటి పథకాలు ఆగవు.. చదువులపై దృష్టి సారించాలని రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కోరారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గత కొద్ది రోజులుగా నిర్వహించిన క్రికెట్‌ టీడీపీ ప్రీమియర్‌ లీగ్‌లో 64 జట్లు పాల్గొన్నాయి. అందులో విజేతగా బొబ్బిలి క్రికెట్‌ టీం నిలివగా, రెండో స్థానంలో సాలూరు క్రికెట్‌ టీం నిలిచింది. విజేతగా నిలిచిన బొబ్బిలి టీంకు రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చేతులగా మీదుగా ట్రోఫీని అందజేయడంతో పాటు విజేతగా నిలిచిన టీంకు రూ.30వేలను అందజేశారు. రెండో స్థానంలో నిలిచిన సాలూరు టీంకు టీడీపీ కౌన్సిలర్‌ హర్షవర్ధన్‌, నాయకులు బందాపు సతీష్‌లు రూ.15వేలు పారితోషకంతో పాటు ట్రోఫీని కూడా అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ నాయకులు నిమ్మాది తిరుపతిరావు, పరమేష్‌, వేణు, జనసేన నాయకులు శివకృష్ణ, పట్టణ సీఐ వాసునాయుడు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2024 | 12:11 AM