Share News

వైసీపీని తరిమికొట్టాలి

ABN , Publish Date - Mar 11 , 2024 | 12:12 AM

రానున్న ఎన్నికల్లో వైసీపీని తరిమికొట్టాలని తెలుగుదేశం పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.

వైసీపీని తరిమికొట్టాలి

రానున్న ఎన్నికల్లో వైసీపీని తరిమికొట్టాలని తెలుగుదేశం పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఆదివారం టీడీపీ నాయకులు సూపర్‌సిక్స్‌ పథకాలపై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేశారు. టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేపట్టబోయే సూపర్‌సిక్స్‌ పథకాలను వివరించారు. పలుచోట్ల వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు.

టీడీపీ-జనసేన విస్తృత ప్రచారం

పార్వతీపురం, ఆంధ్రజ్యోతి: జిల్లా కేంద్రం పార్వతీపురం పట్టణంలో టీడీపీ, జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయచంద్ర ఆది వారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ముందుగా టీడీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ద్వారపురెడ్డి శ్రీదేవి పాల్గొంటూ ప్రచారంచేశారు ఇంటింటికి వెళ్లి బాబు ష్యూరిటీ భవిష్య త్తుకు గ్యారెంటీ కార్యక్రమంపై వివరించారు.కార్యక్రమంలో టీడీపీ నాయకులు బార్నాల సీతారాం, ఎం.సత్యనారాయణ, మజ్జి వెంకటేష్‌, కోలా మధుసూద నరావు, జి.రవిఉమార్‌, రాజశేఖర్‌, మరియదాసు, బడే గౌరునాయుడు, టి.సత్యనారాయణ, డాక్టర్‌ భాన్రుపసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 19, 24వ వార్డుల్లో జరిగిన ప్రచార కార్యక్రమంలో విజయ్‌చంద్రకు మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు.

సంధ్యారాణికి పాస్టర్లు మద్దతు

సాలూరు: రానున్న ఎన్నికల్లో టీడీపీ-జనసేన బలపరిచిన అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణికి తమ సంపూర్ణ మద్దతు ఇస్తామని సాలూరు నియో జకవర్గ పాస్టర్లు తెలిపారు. పట్టణంలోని మెంటాడ వీధిలో ఉన్న శ్రీకోదండ రామ కల్యాణ మండపంలో నియోజకవర్గ పాస్టర్ల సమావేశం ఆదివారం నిర్వ హించారు. ఈసందర్భంగా ముఖ్యఅతిథులుగా బాగువలసకు చెందిన పాస్టర్‌ ఫిలిప్స్‌, గుమ్మిడి సంధ్యారాణి, ఎక్సైజ్‌ సూపరింటెంటెండ్‌ (వీఆర్‌ఎస్‌) చింతగడ దాస్‌ పాల్గొన్నారు. ఈసందర్భంగా పాస్టర్లు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తామంతా సంధ్యారాణికి తమ మద్దతు తెలియజేస్తామని తెలిపారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం పాస్టర్లకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవే ర్చలేదన్నారు. పాస్టర్లకు ఫెన్షన్‌ ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. అనం తరం సంధ్యారాణి గెలుపు కోసం ప్రత్యేక ప్రార్ధనలు చేసి ఆమెను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పలువురు పాస్టర్లు పాల్గొన్నారు.

టీడీపీలో పలువురి చేరిక

పార్వతీపురం రూరల్‌: పార్వతీపురం పట్టణంలో 11 వార్డుకు చెందిన పలువురు టీడీపీలోచేరారు. మండలంలోని వెంకంపేటలో ఉన్న టీడీపీ- జన సేన ఉమ్మడి అభ్యర్థి బోనెల విజయచంద్ర స్వగృహం వద్ద జరిగిన కార్యక్ర మంలో 11వ వార్డుకు చెందిన వివిధ పార్టీలకు చెందిన పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.వీరికీ పార్టీ కండువాలు వేసి విజయచంద్ర ఆహ్వానిం చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు మజ్జి వెంకటేష్‌ పాల్గొన్నారు.

విజయమే లక్ష్యంగా పనిచేస్తాం

బెలగాం: పార్వతీపురం నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా కలిసి పనిచేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బోనెల విజయచంద్ర, జనసేన నాయకుడు అనిల్‌ అన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు అయిన సందర్భంగా ఆదివారం స్థానిక బీజేపీ కార్యాలయానికి ఉమ్మడి అభ్యర్థి విజయచంద్రను సాదరంగా ఆహ్వానించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ అరాచర పాలన చేస్తున్న వైసీపీని తరిమికొట్టడానికి, రాష్ట్ర అభివృద్ధికి మూడు పార్టీల కలయిక జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గెలుపే లక్ష్యంగా పనిచేయండి

గరుగుబిల్లి: కురుపాం నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థి తోయక జగదీశ్వరి గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచే యాలని టీడీపీ నాయకుడు గొట్టాపు లక్ష్ముంనాయుడు కోరారు. కొత్తపల్లిలో క్లస్టర్‌ ఇన్‌చార్జిలతో కలిసి ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో, సూపర్‌ సిక్స్‌పై వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మర్రాపు ఫృద్విరాజు, గొట్టాపు సత్యంనాయుడు, మర్రాపు శ్రీను, గంగాధరరావు పాల్గొన్నారు.

కురుపాం రూరల్‌: జరడ పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో ఆదివారం కురుపాం టీడీపీ, జనసేనపార్టీ ఉమ్మడి అభ్యర్ధి తోయిక జగదీశ్వరి ఆధ్వర్యంలో శంఖారావం, సూపర్‌ సిక్స్‌ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్వరి మాట్లాడుతూ రాబోయేది తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. కార్య క్రమంలో టీడీపీ మండల కన్వీనీరు కలిశెట్టి కొండయ్య, వెంపటాపు భారతి, కిరణ్‌, శంకర్‌ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

సాలూరు రూరల్‌: సాలూరు మండలంలో గిరిశిఖర గ్రామాలైన కొదమ, చొర, చింతామల తదితర గ్రామాల్లో టీడీపీ సాలూరు అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. సాలూరు మండలంలో ఎత్తెన గిరిశిఖర గ్రామాలైన కొదమ పంచాయతీ, కొఠియా గ్రూప్‌ గ్రామాలైన పట్టుచెన్నారు, పగులుచెన్నారు, డొలియాంబ గ్రామాలకు ఆదివారం ఆమె ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు వెళ్లాయి. ఆయా గ్రామాల్లో బాబు ష్యూరిటీ, భవి ష్యత్‌ గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడారు. వైసీపీ హయాంలో గిరిజనులకు జరిగిన అన్యాయం జరిగిందన్నారు. పలు పథకాలు తీసివేశారన్నారు. రాష్ట్ర భవిష్యత్‌కు టీడీపీ రావడం అవశ్యమన్నారు. వైసీపీ పాలనపై ధ్వజమెత్తారు. కార్యక్రమంలో సాలూరు మండల టీడీపీ అధ్యక్షుడు ఆముదాల పరమేశు,అక్యాన వెంకట తిరుపతిరావు, మాలతి దొర,గణపతి,లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2024 | 12:12 AM