Share News

సంక్షేమాన్ని విస్మరించిన వైసీపీ

ABN , Publish Date - Mar 09 , 2024 | 12:07 AM

వైసీపీ ప్రభుత్వ హయాం ప్రజల సంక్షేమాన్ని విస్మరించిందని టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు. శుక్రవారం జిల్లాలో బాబు ష్యూరిటీ-భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. పార్వతీపురం నియోజకవర్గ ఇన్‌చార్జి మసీదును సందర్శించారు.

 సంక్షేమాన్ని విస్మరించిన వైసీపీ
కురుపాం రూరల్‌: ఒబ్బంగిలో ప్రతిజ్ఞ చేస్తున్న టీడీపీ శ్రేణులు:

ఫ తెలుగుదేశం పార్టీ నాయకులు ధ్వజం

వైసీపీ ప్రభుత్వ హయాం ప్రజల సంక్షేమాన్ని విస్మరించిందని టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు. శుక్రవారం జిల్లాలో బాబు ష్యూరిటీ-భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. పార్వతీపురం నియోజకవర్గ ఇన్‌చార్జి మసీదును సందర్శించారు.

ముస్లిముల సంక్షేమానికి ప్రాధాన్యం..

బెలగాం: ముస్లిము మైనార్టీల సంక్షేమాన్ని వైసీపీ ప్రభుత్వం అటకెక్కించిందని పార్వతీపురం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి విజయచంద్ర ఆరోపించారు. టీడీపీలో ముస్లిముల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. శుక్రవారం పార్వతీపురంలోని బంగారమ్మ కాలనీలో ఉన్న మసీదును సందర్శించారు. ఈ సందర్భంగా విజయచంద్ర మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్వతీపురంలోని ముస్లిముల సంక్షేమానికి ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. షాదీఖానా నిర్మాణం, ఆర్థికంగా ఎదుగుదల కోసం పథకాలు అమలు చేస్తామన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ముస్లిముల కోసం పెట్టిన అనేక సంక్షేమాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసి, వారికి అన్యాయం చేసిందని ఆరోపించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పి.సత్యనారాయణ, సింహాచలం నాయుడు, శ్రీరాములు, మధు, గుంట్రెడ్డి రవి, జనసేన నాయకులు పాల్గొన్నారు.

టీడీపీతోనే సంక్షేమం సాధ్యం..

గరుగుబిల్లి: ప్రజలు ఆర్థికంగా ఉండేందుకు సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అందించేది తెలుగుదేశం పార్టీయేనని ఆ పార్టీ అరకు నియోజకవర్గ కార్యనిర్వాహక కార్యదర్శి ముదిలిబాబు విజయవాంకుశం తెలిపారు. మండలంలోని లఖనాపురం, గదబవలసల్లో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పాలనలో ప్రజలు పూర్తిగా విసుగు చెందారన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు అధికారంలోకి రావడం తథ్యమన్నారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలతో ప్రజలు ఆకర్షితులవుతున్నారన్నారు.

ఒబ్బంగిలో టీడీపీ శ్రేణుల ప్రతిజ్ఞ..

కురుపాం రూరల్‌: కురుపాం నియోజకవర్గంనుంచి పోటీచేస్త్ను తోయక జగదీశ్వరిని గెలిపించి అధికారంలోని తీసుకువస్తామని ఆ పార్టీ కార్యకర్తలు, గృహ సారధులు తెలిపారు.ఈ మేరకు శుక్రవారం ఒబ్బంగి, ఊసకొండ గ్రామాల్లో ప్రతిజ్ఞ చేశారు.

Updated Date - Mar 09 , 2024 | 12:07 AM