Share News

డీలరు పోస్టులకు రాత పరీక్ష

ABN , Publish Date - Dec 27 , 2024 | 12:13 AM

బొబ్బిలి రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఖాళీగా ఉన్న రేషన్‌ డిపో డీలరు పోస్టుల భర్తీ కోసం గురువా రం స్థానిక ట్రిపుల్‌ ఎస్‌ డిగ్రీ కళాశాలలో రాత పరీక్ష నిర్వహించారు.

డీలరు పోస్టులకు రాత పరీక్ష

బొబ్బిలి, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఖాళీగా ఉన్న రేషన్‌ డిపో డీలరు పోస్టుల భర్తీ కోసం గురువా రం స్థానిక ట్రిపుల్‌ ఎస్‌ డిగ్రీ కళాశాలలో రాత పరీక్ష నిర్వహించారు. మొత్తం 32 డీలర్లను నియమించేందుకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. మొత్తం 121 మంది అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకు న్నారు. 101 మంది పరీక్షకు హాజరు కాగా, వారిలో 20 మంది గైర్హాజర య్యారు. స్థానిక ఆర్డీవో జేవీఎస్‌ఎస్‌ రామ్మోహనరావు, సీఎస్‌డీటీలు రెడ్డి సాయికృష్ణ పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించారు.

పకడ్బందీగా నిర్వహణ

పరీక్షలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించినట్టు ఆర్డీవో జేవీఎస్‌ఎస్‌ రామ్మోహనరావు తెలిపారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పారు. ప్రతి రేషన్‌ డిపో పరిధిలో 800 కార్డులు దాటిన పక్షంలో అలాంటి చోట అదనంగా మరో డీలరు పోస్టు కోసం నోటిఫికేషన్‌ ఇచ్చామన్నారు. అలా గజపతినగరం, పురిటి పెంట గ్రామాల్లో రెండు డీలరు పోస్టు మంజూరు కావడంతో అక్కడి వారు కోర్టుకు వెళ్లారన్నారు. దీంతో అక్కడ పరీక్షను నిలిపివేశామని ఆర్డీవో తెలిపారు. వచ్చే నెల 1 నుంచి కొత్త డీలర్ల నియామకానికి చర్య లు తీసుకుంటున్నామని చెప్పారు. మండలాల సీఎస్‌డీటీలు రెడ్డి సాయికృష్ణ, శశికళ, స్వర్ణలత, సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2024 | 12:13 AM