Share News

టీడీపీ బలోపేతానికి కృషి చేయండి

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:02 AM

తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నియోజకవర్గ ఇన్‌చార్జి అదితి గజపతిరాజు పిలుపునిచ్చారు.

 టీడీపీ బలోపేతానికి కృషి చేయండి
టీడీపీలో చేరిన కార్యకర్తలు, నేతలతో అదితి గజపతిరాజు

విజయనగరం రూరల్‌: తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నియోజకవర్గ ఇన్‌చార్జి అదితి గజపతిరాజు పిలుపునిచ్చారు. గురువారం నగరంలోని 5, 7 డివిజన్ల పరిధిలో వివిధ పార్టీల వారు టీడీపీలో చేరారు. వారికి అదితి పసుపు కండువాలు వేసి ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పని చేస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా టీడీపీ పాలన సాగిందన్నారు. ప్రస్తుత వైసీపీ పాలనలో రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్లిందని విమర్శించారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడాలంటే.. అందరూ సమష్టిగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ ప్రసాదుల కనకమహాలక్ష్మి, విజయనగరం అర్బన్‌ అధ్యక్షుడు ప్రసాదుల ప్రసాద్‌, ఐదో డివిజన్‌ ఇన్‌ఛార్జి నాగరాజు, నాయకులు ఐవీపీ రాజు, ఆల్తి బంగారుబాబు, కంది మురళీనాయుడు, పిళ్లా విజయ్‌కుమార్‌, అవనాపు విజయ్‌, గదుల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

వైసీపీ ఖాళీ అవుతుంటే భయం..

విజయనగరం (ఆంధ్ర జ్యోతి): ‘రాక్షస పాలనతో విసిగిపోయి..అమ్మలాంటి టీడీపీలోకి చేరుతున్న వారిపై విజయనగరానికి చెందిన కొంతమంది వైసీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడడం సిగ్గుచేటు. టీడీపీ కార్యకర్తలను బెదిరిస్తు న్నారంటే వైసీపీ ఖాళీ అవుతుంటే నాయకులు భయపడినట్లే’నని విజయనగరం నియోజకవర్గ ఇన్‌చార్జి అదితి విజయలక్ష్మీ గజపతిరాజు వ్యాఖ్యానించారు. విజయ నగరం మండలం రీమాపేట పంచాయతీ అంబటివలసకు చెందిన సుమారు 120 కుటుంబాలు గురువారం టీడీపీలో చేరాయి. చిల్ల సత్యనారాయణ, తాడ్డి నారాయణప్పడు, సనాపతి పైడప్పనాయుడు, రేపల్లె సత్యనారాయణ, తాడ్డి అప్పలనాయుడు, రేగాన ప్రకాష్‌రావు, చిల్లా వెంకట లక్ష్మి, తాడ్డి అచ్చియ్యమ్మ తదితరులకు కండువాలు వేసి అదితి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదోడి భూమిపై వైసీపీ పెద్దల కన్ను పడుతోందని... ఇలాంటి కష్టాలు, నష్టాలు భరించలేక తెలుగుదేశం పార్టీలో చేరుతుంటే వైసీపీ నేతలకు భయం పట్టుకుందని విమర్శించారు. చంద్రబాబునాయుడు, పవన్‌ కల్యాణ్‌ ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఈగల సత్తిబాబు, బొద్దల నర్సింగరావు, గంటా పోలినాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సూపర్‌ సిక్స్‌ కార్యక్రమాలపై గురువారం రాత్రి పడాలపేట పంచాయతీలో ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 12:02 AM