Share News

మహిళలకు రక్షణ కల్పించాలి

ABN , Publish Date - Oct 25 , 2024 | 12:12 AM

మహిళలు, విద్యార్థినులకు ప్రత్యేక రక్షణ కల్పించాలని డీఐజీ గోపీనాథ్‌జట్టి సూచించారు. గురువారం స్థానిక స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

 మహిళలకు రక్షణ కల్పించాలి
పోలీస్‌స్టేషన్‌ పరిసరాలను పరిశీలిస్తున్న డీఐజీ, ఎస్పీ తదితరులు

బలిజిపేట, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): మహిళలు, విద్యార్థినులకు ప్రత్యేక రక్షణ కల్పించాలని డీఐజీ గోపీనాథ్‌జట్టి సూచించారు. గురువారం స్థానిక స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం రికార్డులు పరిశీ లించారు. పెండింగ్‌ కేసులపై శ్రద్ధ వహించాలని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎస్‌ఐ సింహాచలాన్ని ఆయన ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు, గ్రామాల్లో ప్రజలకు వివిధ చట్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు. మహిళా పోలీసుల సహకారంతో సైబర్‌ క్రైమ్‌, నాటుసారా తయారీ నిర్మూలనకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ పరిశీలనలో ఎస్పీ మాధవరెడ్డి, ఏఎస్పీ అంకిత సురానా మహావీర్‌, సీఐ గోవిందరావు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 12:12 AM