Share News

మహిళలే నిర్ణేతలు

ABN , Publish Date - May 15 , 2024 | 11:50 PM

సార్వత్రిక ఎన్నికల్లో మహిళలే ఎక్కువగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. పలుచోట్ల పురుషుల కంటే మహిళల ఓటింగ్‌ శాతం ఎక్కువగా ఉంది. చంటి పిల్లలతో కూడా ఎంతోమంది వచ్చారు. క్యూలో గంటల తరబడి నిల్చొని మరీ ఓటు వేశారు.

మహిళలే నిర్ణేతలు

పార్వతీపురం, మే15 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల్లో మహిళలే ఎక్కువగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. పలుచోట్ల పురుషుల కంటే మహిళల ఓటింగ్‌ శాతం ఎక్కువగా ఉంది. చంటి పిల్లలతో కూడా ఎంతోమంది వచ్చారు. క్యూలో గంటల తరబడి నిల్చొని మరీ ఓటు వేశారు. దీంతో అభ్యర్థుల గెలుపు.. ఓటములలో వీరే ప్రఽధాన పాత్ర పోషించనున్నారు. జిల్లాలో మొత్తంగా 7,83,440 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 3,82,589 మంది పురుషులు 4,00,779 మంది మహిళలు, ఇతరులు 72 మంది ఉన్నారు. ఇందులో 2,94,777 మంది పురుషులు, 3,09,245 మంది మహిళలు, 42 మంది ఇతరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఓటు వేసినట్లు స్పష్టమవుతోంది. ఏ నియోజకవర్గంలో చూసినా ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో మహిళలే అధికంగా కనిపిస్తున్నారు. మొత్తంగా అభ్యర్థుల భవితవ్యాన్ని వారే తేల్చనున్నారు.

నియోజకవర్గాల వారీగా చూస్తే..

పార్వతీపురం నియోజకవర్గంలో 96,292 మంది మహిళా ఓటర్లు ఉండగా 75,908 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 93,514 మంది పురుషులు ఉండగా 72,592 మంది ఓటు వేశారు.

సాలూరు నియోజకవర్గంలో 1,04,715 మంది మహిళా ఓటర్లు ఉండగా 79,928 మంది ఓటు వేశారు. 99,770 మంది పురుషులు ఉండగా.. 76,403 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కురుపాం నియోజకవర్గంలో 99,736 మంది మహిళలకు గాను 78,419 మంది ఓటు వేశారు. పురుష ఓటర్లు 94,336 మంది ఉండగా 74,005 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పాలకొండ నియోజకవర్గంలో 1,00,036 మంది మహిళా ఓటర్లు ఉండగా 74,990 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 94,969 మంది పురుష ఓటర్లు ఉండగా 71,777 మంది ఓటు వేశారు. మొత్తంగా నాలుగు నియోజకవర్గాల్లోనూ మహిళలే అఽధికంగా తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. అభ్యుర్థుల గెలుపులో వారి పాత్ర కీలకం కానుంది.

Updated Date - May 15 , 2024 | 11:50 PM