Share News

అగ్ని ప్రమాదంలో మహిళకు గాయాలు

ABN , Publish Date - Mar 26 , 2024 | 12:24 AM

కొత్తబగ్గాం గ్రామంలో ఓ మహిళ అగ్ని ప్రమాదంలో తీ వ్రంగా గాయపడింది. గ్రామానికి చెందిన సారికి బంగారమ్మ సోమవారం పొలంలో చెత్తకుప్పలకు నిప్పు పెట్టింది. మంటలు చెలరేగి బంగారమ్మ చీరకు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడింది.

అగ్ని ప్రమాదంలో మహిళకు గాయాలు

గజపతినగరం: కొత్తబగ్గాం గ్రామంలో ఓ మహిళ అగ్ని ప్రమాదంలో తీ వ్రంగా గాయపడింది. గ్రామానికి చెందిన సారికి బంగారమ్మ సోమవారం పొలంలో చెత్తకుప్పలకు నిప్పు పెట్టింది. మంటలు చెలరేగి బంగారమ్మ చీరకు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడింది. దగ్గరలో గల చేపల చెరువు నుంచి వ స్తున్న స్థానికులు చూసి 108 వాహనంలో బాధితురాలిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడడంతో న్యాయాధికారి కె.కనకలక్ష్మి బాధితు రాలి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. బంగారమ్మ భర్త అప్పారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ ఎన్‌.వి.ప్రభాకరరావు తెలిపారు.

నీలగిరి తోట దగ్ధం

భోగాపురం: చేపలకంచేరు గ్రామ సమీపంలో సోమవారం అరజర్ల ఎర్రన్న కు చెందిన నీలగిరి తోట అగ్నికి ఆహుతైంది. గ్రామ సమీపంలో ఉన్న నీలగిరి తోటలో ఉన్నట్టుండి మంటలు వ్యాపించాయి. నేలరాలిన ఆకులు బాగా ఎండి ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. స్థానికులు సమీపంలో ఉన్న నీటి తో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు. చిట్టివలసకు చెందిన అ గ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. విషయం తెలుసుకున్న వీఆర్వో సుజాత ఘటన స్థలాన్ని పరిశీలించి.. వివరాలు నమోదు చేసుకున్నారు.

Updated Date - Mar 26 , 2024 | 12:24 AM