Share News

వదలవు.. కదలవు!

ABN , Publish Date - Jan 05 , 2024 | 12:09 AM

కొమరాడ మండలం కుమ్మరిగుంట రహదారిపై గురువారం ఏడు గజరాజులు హల్‌చల్‌ చేశాయి. దీంతో ఆ దారిలో ప్రయాణించే వారు, ప్రజలు, వాహనదారులు బెంబేలెత్తిపోయారు.

 వదలవు.. కదలవు!
కుమ్మరిగుంట ప్రధాన రహదారిపై సంచరిస్తున్న ఏనుగుల గుంపు

కొమరాడ/భామిని, జనవరి 4 : కొమరాడ మండలం కుమ్మరిగుంట రహదారిపై గురువారం ఏడు గజరాజులు హల్‌చల్‌ చేశాయి. దీంతో ఆ దారిలో ప్రయాణించే వారు, ప్రజలు, వాహనదారులు బెంబేలెత్తిపోయారు. అవి ఎవరిపై దాడి చేస్తాయోనని ఆందోళన చెందారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది అక్కడకు వచ్చి సమీప ప్రాంతంలో ఉన్న పంట పొలాల్లోకి ఏనుగుల గుంపును తరలించారు. దీంతో ఆ రహదారి గుండా ప్రయాణాలు యథావిధిగా సాగాయి. ఇక భామినిలో సంచరిస్తున్న ఏనుగులు నల్లరాయిగూడ సమీపానికి చేరుకొని చెరకు తోటల్లో తిష్ఠవేశాయి. సాయంత్రం ఆరుబయట సంచరించాయి. ఏనుగుల వల్ల పంటలను నష్టపోయామని, తమను ఆదుకోవాలని సొలికిరి గ్రామానికి చెందిన రైతులు కోరుతున్నారు.

Updated Date - Jan 05 , 2024 | 12:09 AM