లేగ దూడపై వన్యమృగం దాడి
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:11 AM
మండలంలోని రేగ గ్రామంలో గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని వన్యమృగం లేగ దూడపై దాడి చేయడంతో దూడ మృతిచెందింది.

లక్కవరపుకోట, జూలై 4: మండలంలోని రేగ గ్రామంలో గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని వన్యమృగం లేగ దూడపై దాడి చేయడంతో దూడ మృతిచెందింది. రేగ గ్రామానికి చెందిన బొడ్డు అచ్చెంనాయుడుకు చెందిన సుమారు సంవత్సరం వయస్సు కలిగిన లేగదూడ ఈ ఘటనలో మృతి చెందడంతో అటవీశాఖాధికారులకు, పశుసంర్ధక శాఖ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. ఫారెస్టుగార్డు రాజేశ్వరి గురువారం ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేశారు. అనంతరం తూర్పుకనుమల వన్య ప్రాణుల సంరక్షణా సొసైటీ అధికారి మూర్తి, గార్డు కలసి క్షుణ్ణంగా పరిశీలించారు. పశువుపై ఉన్న గాయాలను బట్టి ఎలుగుబంటి జాతికి చెందిన జంతువు దాడి చేసి ఉంటుందని అంచనాకు వచ్చారు. రైతు కళ్లంలో రెండు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. రైతులు ఒంటరిగా తిరగొద్దని సూచించారు. ఇప్పటికే కిర్ల, కొట్యాడ, తలారి, ఖాసాపేట, ఆర్జీపేట గ్రామాల్లో ఎలుగుబంటి తిరుగుతున్నట్టు సమాచారం ఉందని గార్డు తెలిపారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.