Share News

ఎక్కడ ఉండమంటారు?

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:41 AM

రాజాం పురపాలక సంఘ భవనం పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది. పంచాయతీ నుంచి నగర పంచాయతీ ఆ తర్వాత మున్సిపాల్టీగా స్థాయి పెరిగినా ఇప్పటికీ పూర్తిస్థాయిలో కార్యాల యం సమకూరలేదు.

ఎక్కడ ఉండమంటారు?

- మున్సిపాలిటీకి కార్యాలయం లేని వైనం

- పంచాయతీ భవనం నుంచే కార్యకలాపాలు

- ఇబ్బంది పడుతున్న సిబ్బంది

- కార్యరూపం దాల్చని ఎమ్మెల్యే హమీ

(రాజాం)

రాజాం పురపాలక సంఘ భవనం పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది. పంచాయతీ నుంచి నగర పంచాయతీ ఆ తర్వాత మున్సిపాల్టీగా స్థాయి పెరిగినా ఇప్పటికీ పూర్తిస్థాయిలో కార్యాల యం సమకూరలేదు. దశాబ్దాల కిందట నిర్మించిన రాజాం పంచాయతీ కార్యాలయంలోనే విధులు నిర్వహిస్తున్నారు. ఈ భవనం పైకప్పు పెచ్చు లూడి పడుతుండడంతో సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. పట్టణ ప్రణాళిక విభాగం గదిలో స్లాబ్‌ పెచ్చులూడి ఇటీవల సిబ్బందిపై పడింది. అంతేకాకుండా వర్షాకాలం వచ్చిందంటే ఈ గదిలో విధులు నిర్వహిస్తున్న కంప్యూటర్‌ ఆపరేటర్లు టార్పాలిన్లు కప్పుకొని విధులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది.

ఆదాయం వస్తున్నా..

పురపాలక సంఘానికి ఆదాయం వస్తున్నా నూతన భవనం నిర్మాణా నికి చర్యలు తీసుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏడాది ఆస్తి. తాగునీటి పన్నులతో పాటు వాణిజ్య సముదాయాలు అద్దెలు, ఇంటిప్లా న్లు, అనుమతులు, ఖాళీ స్థలాల పన్నులు, ట్రేడ్‌ లైసెన్సులు, మార్కెట్‌ కిస్తీ తదితర వాటి నుంచి ఏడాదికి రూ.6 కోట్ల వరకు ఆ దాయం వస్తుంది. పురపాలక సంఘానికి సరిపడా వసతి లేక పోవడంతో తెలుగుదేశం పార్టీ అధి కారంలో ఉన్నప్పుడు ఆర్టీసీ కూడలిలో అన్న క్యాంటీన్‌ కోసం రూ.40 లక్షలతో నిర్మిం చిన భవనం విషయంలో అధికారులు దృష్టిపె ట్టారు. ఈ భవనాన్ని ముందుగా స్వయంశక్తి సం ఘాలు వారు తయారు చేస్తున్న వస్తువులను విక్ర యించేందుకు మహిళా బజార్‌ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఆ తరువాత పట్ట ణ ప్రణాళిక విభాగం, శానటరీ ఇన్స్‌పెక్టరు కార్యాలయాలకు అనుగుణంగా నిర్మాణాలు చేపడుతున్నారు.

ఉన్నస్థలం దారాదత్తం

ఆర్టీసీ కాంప్లెక్స్‌ కూడలిలో ఉన్న స్థలా న్ని ఆర్టీసీ కాంప్లెక్స్‌, రైతు బజారు, వార్డు సచివాలయం నిర్మాణానికి ధారాదత్తం చేసిన అధికారులు.. ఇప్పుడు నూతన భవన నిర్మాణానికి స్థలం కోసం వెతుకులాట ప్రారంభించారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌ స్థలం ఏ శాఖకూ కేటాయించ కుండా ఉంటే పురపాలక సంఘ కార్యాలయ నూతన భవనం నిర్మాణానికి ఉపయోగపడేది. పట్టణ నడిబొడ్డులో ఉన్న స్థలంలో వాణిజ్యపరంగా తీర్చిదిద్దితే పురపాలక సంఘానికి భారీగా ఆదాయం సమకూరేది. సొంత భవనం నిర్మిస్తే ఆ సమస్య కూడా తీరేది. ఈ రెండింటికీ కాకుండా ఇతర అవసరాలకు స్థలాలను కేటాయించడంతో ఆదాయానికి గండి పడుతుండటంతో పాటు నూతన భవనం నిర్మాణానికి స్థలం లేకుండా పోయింది.

హామీ ఏమైందయ్యా..

పురపాలక సంఘ కార్యాల య నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే కంబాల జోగులు హామీ ఇచ్చారు. ఎన్నికలు మందు ఇచ్చిన హమీ ఐదేళ్లు దాటినా ఇంతవరకు నెరవేర లేదు. ఈ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఎమ్మెల్యే ఇచ్చిన హామీ ఏమైందని మున్సిపాల్టీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

శిథిలమవడం వాస్తవమే

ప్రస్తుతం ఉన్న భవనం శిథిలావస్థకు చేరుకోవడం వాస్తవమే. పాతది కావడంతో పైకప్పు పెచ్చులూడుతోంది. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో నిరుపయోగంగా ఉన్న అన్న క్యాంటీన్‌ కోసం నిర్మించిన భవనాన్ని ప్రజారోగ్యశాఖ శానిటరీ ఇన్స్‌పెక్టర్‌, పట్టణ ప్రణాళిక విభాగం కార్యాలయాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించాం. ఇది కూడా తాత్కాలిక ఏర్పాట్లు మాత్రమే. సొంతభవనం అందుబాటులోకి వస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు.

- రామప్పలనాయుడు, కమిషనర్‌ పురపాలక సంఘం, రాజాం

శిథిలమైన పురపాలక సంఘం కార్యాలయం భవనం

Updated Date - Apr 25 , 2024 | 12:41 AM