Share News

రోడ్లు ఏవీ.. కరెంటెక్కడ?

ABN , Publish Date - Feb 20 , 2024 | 11:51 PM

టిడ్కో ఇళ్ల వద్ద మరోసారి అధికారులు, మంత్రి, ఎమ్మెల్యేలు తెగ హడావిడి చేశారు. ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా ప్రారంభించకుండా వదిలేసిన ఆ ఇళ్లను ఎన్నికలు దగ్గర పడుతున్న దశలో లబ్ధిదారులకు అందజేయడానికి చాలా ఆరాటపడ్డారు.

రోడ్లు ఏవీ.. కరెంటెక్కడ?

రోడ్లు ఏవీ.. కరెంటెక్కడ?

మౌలిక సదుపాయాలు కల్పించకుండా టిడ్కో ఇళ్ల పంపిణీ

ఎన్నికల వస్తుండడంతో హడావిడి

(విజయనగరం- ఆంధ్రజ్యోతి)

టిడ్కో ఇళ్ల వద్ద మరోసారి అధికారులు, మంత్రి, ఎమ్మెల్యేలు తెగ హడావిడి చేశారు. ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా ప్రారంభించకుండా వదిలేసిన ఆ ఇళ్లను ఎన్నికలు దగ్గర పడుతున్న దశలో లబ్ధిదారులకు అందజేయడానికి చాలా ఆరాటపడ్డారు. మౌలిక సౌకర్యాలేవీ కల్పించకుండా పట్టాలను వారి చేతిలో పెట్టారు. మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం టిడ్కో ఇళ్లను లబ్ధిదార్లకు అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. వాస్తవానికి విజయనగరంలోని సోనియానగర్‌ ప్రాంతంలో టీడీపీ హయాంలో టిడ్కో ఇళ్లను నిర్మించారు. అప్పట్లోనే కీలక పనులన్నీ పూర్తయ్యాయి. కొద్దిరోజుల్లో గృహ ప్రవేశాలు చేపట్టేలోగా ఎన్నికలు రావడం.. ప్రభుత్వం మారిపోవడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కూడా నాలుగున్నరేళ్లు పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికలు సమీపంచడంతో హడావిడి చేసి మంగళవారం పంపిణీ చేపట్టారు. కాగా అక్కడ రోడ్లు సక్రమంగా లేవు. డ్రైనేజీ ఏర్పాట్లు పూర్తికాలేదు. విద్యుత్‌ సౌకర్యం సమకూర్చలేదు. మౌలిక సదుపాయాలు పూర్తి చేయకపోయినా 448 మంది లబ్ధిదార్లకు టిడ్కో ఇళ్లను పంపిణీ చేశామని మంత్రి బొత్స ప్రకటించారు.

----------------

Updated Date - Feb 20 , 2024 | 11:51 PM