Share News

సాగునీటి సంఘాలు ఎక్కడ?

ABN , Publish Date - Jun 08 , 2024 | 11:38 PM

సాగునీరు పుస్కలంగా సరఫరా అయ్యే ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుంది. పచ్చదనం ఫరిడవిల్లుతుంది. అన్నదాత ఆనందపడతాడు. ఆహార ఉత్పత్తి బాగుంటేనే ధరలూ అదుపులో ఉంటాయి. అంత కీలకమైన సాగునీరు పొలాలకు సవ్యంగా సరఫరా కావాలన్నా.. ఏటా ఆయకట్టు విస్తరించాలన్నా.. నీటి వనరుల నిర్వహణ ముఖ్యం. వీటిని నిరంతరం పర్యవేక్షించే సంఘాలు అంతకన్నా కీలకం. మరి సంఘాలు పనిచేస్తున్నాయా అంటే అసలు ఉంటే కదా పనిచేయడానికి. ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం సాగునీటి సంఘాల ఎన్నికలు చేపట్టలేదు. పర్యవసానంగా నీటి వనరులు గాడి తప్పాయి. ప్రధానంగా కాలువలు పూడికతో నిండిపోయాయి. చెరువులు ఆకారాన్ని కోల్పోయాయి.

సాగునీటి సంఘాలు   ఎక్కడ?
వంగర మండలం కొప్పరవలస కొత్తవలస గ్రామాల మధ్య తోటపల్లి ప్రధాన కాలువ దుస్థితి

సాగునీటి సంఘాలు

ఎక్కడ?

ఐదేళ్లుగా నిస్తేజం

ఎన్నికలు నిర్వహించని వైసీపీ ప్రభుత్వం

నీటి వనరుల నిర్వీర్యం

కనీస నిర్వహణ కరువాయె

రైతులకు సాగునీటి ఇక్కట్లు

సాగునీరు పుస్కలంగా సరఫరా అయ్యే ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుంది. పచ్చదనం ఫరిడవిల్లుతుంది. అన్నదాత ఆనందపడతాడు. ఆహార ఉత్పత్తి బాగుంటేనే ధరలూ అదుపులో ఉంటాయి. అంత కీలకమైన సాగునీరు పొలాలకు సవ్యంగా సరఫరా కావాలన్నా.. ఏటా ఆయకట్టు విస్తరించాలన్నా.. నీటి వనరుల నిర్వహణ ముఖ్యం. వీటిని నిరంతరం పర్యవేక్షించే సంఘాలు అంతకన్నా కీలకం. మరి సంఘాలు పనిచేస్తున్నాయా అంటే అసలు ఉంటే కదా పనిచేయడానికి. ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం సాగునీటి సంఘాల ఎన్నికలు చేపట్టలేదు. పర్యవసానంగా నీటి వనరులు గాడి తప్పాయి. ప్రధానంగా కాలువలు పూడికతో నిండిపోయాయి. చెరువులు ఆకారాన్ని కోల్పోయాయి.

రాజాం, జూన్‌ 8:

జిల్లాలో సాగునీటి సంఘాలు నిస్తేజంగా మారాయి. కార్యవర్గాలు లేక సాగునీటి వనరుల నిర్వహణ లేక అచేతనంగా ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలోనే కార్యవర్గాల పదవీకాలం ముగిసింది. కానీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదు. గతంలో చెరువులు, కాలువలు, ఆయకట్టు పరిధిలో ఏ చిన్న సమస్య వచ్చినా నీటి సంఘాల ప్రతినిధులు స్పందించేవారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టే వారు. ఇప్పుడా పరిస్థితి లేదు. సాగునీటి సమస్యలు పరిష్కారం కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 431 సాగునీటి సంఘాలు ఉన్నాయి. వెంగళరాయసాగర్‌, పెద్దగెడ్డ, ఒట్టిగెడ్డ, పెద్దలంకాం, తాటిపూడి, ఆండ్ర, డెంకాడ ప్రాజెక్టు కమిటీలు ఉన్నాయి. వేలాది చెరువులు వీటి పరిధిలో ఉన్నాయి. చెరువుల్లో పూడికతీత, మదుములు, తూముల నిర్మాణం, మరమ్మతులు, కాలువ విస్తరణ, జంగిల్‌ క్లియరెన్స్‌ వంటి పనులు నీటి సంఘాలు చేపట్టేవి. దాదాపు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వీటి కార్యకలాపాలు నిలిచిపోయాయి.

గతంలో..

చంద్రబాబు, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌ రెడ్డి హయాంలో నీటి సంఘాల పాత్ర కీలకంగా ఉండేది. ఏటా ఖరీఫ్‌, రబీకి ముందు నీటి సంఘాల ఆధ్వర్యంలో రైతులతో గ్రామసభ నిర్వహించేవారు. చెరువులు, కాలువల అభివృద్ధి పనులను గుర్తించేవారు. రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించేవారు. ప్రతిపాదనలు రూపొందించి ఇరిగేషన్‌ అధికారుల ద్వారా ప్రభుత్వానికి నివేదించేవారు. దానికి అనుగుణంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేసేది. పనులు యుద్ధ ప్రాతిపదికన చేసేవారు. దీంతో చెరువులు, కాలువల పరిధిలో శివారు ఆయకట్టుకు సైతం సాగునీరు అందేది. ఏడాది పొడవునా ఎటువంటి ఇబ్బందులుండేవి కావు. ఐదేళ్లుగా ఆ పరిస్థితే లేదు. ప్రస్తుతం సంఘం స్థాయిని బట్టి ఏఈ, జేఈ, డీఈఈ, ఎస్‌ఈ స్థాయి అధికారులు ప్రత్యేకాధికారులుగా వ్యవహరిస్తున్నారు.

నిధులు ఇలా...

వాస్తవానికి సాగునీటి సంఘాలకు స్థానిక సంస్థల నుంచి నిధులు సమకూరుతాయి. రైతులు ఏటా చెల్లించే నీటి పన్నులు నీటి సంఘాల ఖాతాలకు జమ అయ్యేవి. వాటికి తోడు ప్రభుత్వం ప్రత్యేక నిధులు జోడించి విడుదల చేసేవి. గత ప్రభుత్వాల హయాంలో నీటి సంఘాలకు నిధులు పుస్కలంగా విడుదలయ్యేవి. రైతులకు అవసరమయ్యే పనులు శరవేగంగా పూర్తయ్యేవి. ఎన్నికలు కూడా రాజకీయాలకతీతంగా పారదర్శకంగా జరిగేవి. క్రియాశీలకంగా ఉండే రైతు ప్రతినిధులను ఎన్నుకునేవారు. భూమి కలిగి, పట్టాదారు పాసుపుస్తకం ఉన్న రైతులను ఓటర్లుగా చేర్చేవారు. మేజర్‌, మీడియం, మైనర్‌ సాగునీటి సంఘాలుగా విభజించి టీసీ మెంబర్లను ఎన్నుకునేవారు. వారిలో ఒకరు సంఘ అధ్యక్షుడిగా వ్యవహరించేవారు. నిధుల విడుదలలో పారదర్శకత పాటించేందుకు ఉమ్మడి అకౌంట్‌ ఉండేది. ఎం.బుక్‌ ప్రాప్తికి పనులు పూర్తయిన వెంటనే బిల్లులు చెల్లింపు జరిగేది. యంత్రాల సాయంతో రైతుకు అవసరమైన పనులు చేపట్టే వారు.

ప్రభుత్వ పరిధిలోనే..

సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణ అనేది ప్రభుత్వ పరిధిలో ఉండే అంశం. ఎక్కడెక్కడ.. ఓటర్లు ఎంతమంది ఉన్నారు? వంటి వివరాలు సేకరించాం. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాకపోవడంతో సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించచలేకపోయాం. అయినా కూడా ఉన్నంతలో సమస్యల పరిష్కారంపై దృష్టిసారిస్తున్నాం.

- వై.రాజేష్‌, ఏఈ, ఇరిగేషన్‌, రాజాం

Updated Date - Jun 08 , 2024 | 11:38 PM