Share News

ఐదేళ్లలో ఏoచేశారు

ABN , Publish Date - Feb 15 , 2024 | 12:13 AM

ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు ఇంకులేని పెన్నుగా ఉండిపోయారని, ఈ ఐదేళ్లలో ఆయన ప్రజలకు ఏ మేలూ చేయలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమ ర్శించారు.

ఐదేళ్లలో ఏoచేశారు

ఐదేళ్లలో ఏoచేశారు

ఉత్తరాంధ్రలో ఆ ముగ్గురిదే పెత్తనం

మూడు రాజధానుల పేరిట విశాఖ లూటీ

మేము రాగానే పరిశ్రమల ఏర్పాటు

యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌

బాడంగి శంఖారావం సభ విజయవంతం

విజయనగరం/బాడంగి/బొబ్బిలి, ఫిబ్రవరి 14: ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు ఇంకులేని పెన్నుగా ఉండిపోయారని, ఈ ఐదేళ్లలో ఆయన ప్రజలకు ఏ మేలూ చేయలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమ ర్శించారు. బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండల కేంద్రంలో బుధ వారం సాయంత్రం జరిగిన శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనపై విరుచుకుపడ్డారు. ఉత్తరాంధ్రను మూడు కుటుంబాల వారు దోచుకుతిన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, బొత్స కుటుంబాలది ఇష్టారాజ్యం అయిపోయిం దన్నారు. వైసీపీ నేతలు మూడు రాజధానుల పేరిట విశాఖను ఆసాం తం లూటీ చేశారని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంట నే ఉత్తరాంధ్రలో పరిశ్రమల ఏర్పా టును ముమ్మరం చేస్తామన్నారు. ఎంతోమంది త్యాగఫలమైన విశాఖ ఉక్కును కాపాడు కుంటామని హామీ ఇచ్చారు. అనంతపురంలో కియా పరిశ్రమ మాది రిగా పలు పరిశ్రమలను తీసుకొస్తామని, స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. పైడితల్లి అమ్మవారు, అల్లూరి సీతారామ రాజు వంటి వారు నడయాడిన పుణ్యభూమిలో వైసీపీ అక్రమార్కుల ఆధిపత్యం తిష్ట వేసిందన్నారు. కొండదేవుపల్లి ఎత్తిపోతల పథకం, వెంగళరాయ అదనపు ఆయకట్టు, పెద్దగెడ్డ నుంచి రామభద్రపురానికి సాగు నీరు, బొబ్బిలిలో ప్రభుత్వ డిగ్రీ, ఇంటర్‌ కళాశాలలు, స్టడీ సర్కి ల్‌, లైబ్రరీ వంటివి ఏర్పాటు చేస్తామన్నారు. బాలయ్య మామ, బ్రాహ్మ ణిలు నిర్వహిస్తున్న కేన్సర్‌ ఆసుపత్రులను అన్ని జిల్లాలకు విస్తరిస్తా మని లోకేశ్‌ హామీ ఇచ్చారు. బాడంగి మండలం ఎరుకలిపాకలు ఎంపీటీసీ పాలవలస గౌరును వైసీపీ వాళ్లు ఇబ్బందులకు గురిచేస్తున్నా రని, వాళ్లందరి పేర్లు రెడ్‌బుక్‌లో నమోద య్యాయన్నారు. గౌరుకు అండగా నిలుస్తా మన్నారు. అక్రమాలకు పాల్పడిన వారం తా బొబ్బిలిలో ఉన్నా బొంబాయిలో దాక్కు న్నా లాక్కొస్తామని హెచ్చరించారు.

- మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడుకు గతంలో సముచిత పదవులు దక్కలేదని, ఈసారి కచ్చితంగా తెంటును చట్టసభలోకి పంపించే బాధ్యత తీసుకుంటానని లోకేశ్‌ హామీ ఇవ్వడంతో పార్టీ శ్రేణులు హర్షధ్వానాలు వ్యక్తం చేశాయి.

తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో జోష్‌

(విజయనగరం- ఆంధ్రజ్యోతి)

లోకేశ్‌ శంఖారావం సభలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు జోష్‌తో కనిపించారు. ప్రజల నుంచి కూడా విశేషమైన స్పందన లభించింది. బాడంగి మండల కేంద్రంలో జరిగిన సమావేశానికి పెద్దసంఖ్యలో జనం తరలివచ్చారు. సాలూరు సదస్సు ముగించుకొని నిర్ణీత సమయానికి అరగంట ముందుగా (సాయంత్రం 5 గంటలకు) లోకేశ్‌ బాడంగి చేరుకున్నారు. మొదట స్థానిక నాయకులతో ముఖాముఖి నిర్వహించారు. ఆ ప్రాంత సమస్యలు, వైసీపీ నాయకుల ఆగడాలు, నిలిచిపోయిన అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆరు గంటలకు సభ మొదలైంది. మొదట నియోజకవర్గ ఇన్‌చార్జి బేబీనాయన, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు, జనసేన పార్టీ ఇన్‌చార్జి గిరడ అప్పలస్వామి ప్రసంగించారు. లోకేశ్‌ 6.35 గంటలకు తన ప్రసంగాన్ని ప్రారంభించి 7.05 గంటల వరకు కొనసాగించారు. సభ చివరిలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన పలువురికి లోకేశ్‌ కండువా వేసి ఆహ్వానించారు. బాడంగి సభ ముగించుకొని రోడ్డుమార్గంలో రాజాం వెళ్లారు.

రాజాంలో లోకేశ్‌కు ఘన స్వాగతం

రాజాం రూరల్‌ : శంఖారావం యాత్రలో భాగంగా బుధవారం రాత్రి 8 గంటలకు రాజాంలో ఏర్పాటు చేసిన బహిరంగ వేదిక వద్దకు లోకేశ్‌ చేరుకున్నారు. ఆయనకు పార్టీ స్థానిక శ్రేణులనుంచి ఘనస్వాగతం లభించింది. రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి కోండ్రు మురళీ మోహన్‌ ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నాయకులంతా వచ్చారు. నేతలను లోకేశ్‌కు కోండ్రు మురళీమోహన్‌ పరిచయం చేశారు. సుమారు అరగంట పాటు నియో జకవర్గ ముఖ్య నేతలతో లోకేశ్‌ మాట్లాడారు. రాత్రి తొమ్మిది గంటల వరకూ ఫొటోలు తీసుకున్నారు. లోకేశ్‌ను చూసేందుకు వచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులతో రాజాం-పాలకొండ రోడ్డులో ట్రాఫిక్‌ నిలిచి పోయింది. రూరల్‌ సీఐ శ్రీనివాస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. గురువారం బహిరంగ సభ జరగనుంది.

--------------------

Updated Date - Feb 15 , 2024 | 12:13 AM