Share News

‘సూపర్‌ సిక్స్‌’ పక్కాగా అమలు చేస్తాం

ABN , Publish Date - Apr 12 , 2024 | 12:32 AM

బొబ్బిలి అసెంబ్లీ టీడీపీ- జనసేన-బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబీనాయన) గురువారం పాతబొబ్బిలి గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు.

 ‘సూపర్‌ సిక్స్‌’ పక్కాగా అమలు చేస్తాం

బొబ్బిలి: బొబ్బిలి అసెంబ్లీ టీడీపీ- జనసేన-బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబీనాయన) గురువారం పాతబొబ్బిలి గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు. ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్‌ సిక్స్‌ పథకాలు పక్కాగా అమలు చేస్తామని కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గిరడ అప్పలస్వామి, పాలూరు బాబు, లంక రమేష్‌, టీడీపీ నాయకులు రాంబార్కి శరత్‌బాబు, పువ్వల శ్రీనివాసరావు, పసుపురెడ్డి లక్ష్మణరావు, సిరిపురపు ధనలక్ష్మి, సజ్జా వెంకటరావు, తూమురోతు వెంకట్‌, కనకమహేశ్‌ పట్నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2024 | 12:32 AM