Share News

తప్పకుండా ఓటేస్తాం

ABN , Publish Date - Apr 18 , 2024 | 11:46 PM

వచ్చే ఎన్నికల్లో తామంతా తప్పకుండా ఓటు వేస్తామని విజయనగరం వస్త్ర వ్యాపారులు ప్రతిజ్ఞ చేశారు. ఓటు హక్కు ప్రాధాన్యం తెలియజేసేందుకు మానవహారం నిర్వహించారు.

తప్పకుండా ఓటేస్తాం
ప్రతిజ్ఞ చేయిస్తున్న ట్రైనీ కలెక్టరు త్రివినాగ్‌

తప్పకుండా ఓటేస్తాం

ప్రతిజ్ఞ చేసిన వస్త్ర వ్యాపారులు

ఓటుపై అవగాహన కల్పించిన ట్రైనీ కలెక్టర్‌ వెంకట్‌ త్రివినాగ్‌

కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 18: వచ్చే ఎన్నికల్లో తామంతా తప్పకుండా ఓటు వేస్తామని విజయనగరం వస్త్ర వ్యాపారులు ప్రతిజ్ఞ చేశారు. ఓటు హక్కు ప్రాధాన్యం తెలియజేసేందుకు మానవహారం నిర్వహించారు. స్వీప్‌ కార్యక్రమంలో భాగంగా స్థానిక బాలాజీ క్లాత్‌ మార్కెట్‌ వద్ద దస్తుల షాపుల యజమానులకు, వర్కర్లకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అసిస్టెంట్‌ కలెక్టర్‌ సహాదిత్‌ వెంకట్‌ త్రివినాగ్‌ మాట్లాడుతూ ఓటు వేయడం ప్రతి పౌరుడి బాధ్యతని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటే వజ్రాయుధమని చెప్పారు. వచ్చే నెల 13న జరిగే పోలింగ్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఎప్పుడైనా ఓటు హక్కును వినియోగించుకో వచ్చునని చెప్పారు. ఓటు హక్కును స్వేచ్ఛగా నిర్భయంగా వినియోగించుకుని సరైన వ్యక్తిని ఎన్నుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ తిరుమలరావు, స్వీప్‌ నోడల్‌ అధికారి హౌసింగ్‌ పీడీ శ్రీనివాసరావు, బాలాజీ మార్కెట్‌ క్లాత్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకటరావు తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 11:46 PM