Share News

ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దుతాం

ABN , Publish Date - Feb 06 , 2024 | 11:51 PM

ఓటర్ల జాబితాల్లో తప్పులను 90 శాతం వరకు సరిదిద్దామని, మరో రెండు రోజుల్లో చిన్న చిన్న తప్పులను కూడా సరిచేసి జాబితాను సిద్ధం చేస్తామని తహసీల్దార్‌ డీజీఎంఎస్‌ ప్రసాదరావు తెలిపారు

ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దుతాం

లక్కవరపుకోట, ఫిబ్రవరి 6: ఓటర్ల జాబితాల్లో తప్పులను 90 శాతం వరకు సరిదిద్దామని, మరో రెండు రోజుల్లో చిన్న చిన్న తప్పులను కూడా సరిచేసి జాబితాను సిద్ధం చేస్తామని తహసీల్దార్‌ డీజీఎంఎస్‌ ప్రసాదరావు తెలిపారు. ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో ఓటరు జాబితాల్లోని తప్పులపై కథనం ప్రచురితమైంది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వీటిని సరిచేసే పనిలో పడ్డారు. గ్రామాల్లో లేనివారికి నోటీసులు జారీ చేశామని, చనిపో యిన వారి ఓట్లను తొలగించామన్నారు. ఎక్కడై నా తప్పులు దొర్లితే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.

Updated Date - Feb 06 , 2024 | 11:51 PM