అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం
ABN , Publish Date - Oct 21 , 2024 | 11:47 PM
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరువీరుల కుటుంబాలకు అండగా ఉంటామని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్, ఎస్పీ మాధవరెడ్డి, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు.
బెలగాం, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి) : విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరువీరుల కుటుంబాలకు అండగా ఉంటామని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్, ఎస్పీ మాధవరెడ్డి, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. సోమవారం పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జాతీయ పోలీసు అమర వీరుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమన్నారు. వారి త్యాగాలు మరువలేమన్నారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులను సత్కరించి యోగక్షేమాలు అడిగి తెలుసు కున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ దిలీప్‌కిరణ్, పార్వతీపురం ఏఎస్పీ అంకిత సురాన, డీఎస్పీలు, సీఐలు తదితరులు పాల్గొన్నారు.